Share News

ఏపీ అభివృద్ధికి అశ్విని వైష్ణవ్ సహకారం అమూల్యమైనది: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Jul 18 , 2026 | 10:57 AM

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీ అభివృద్ధికి అశ్విని వైష్ణవ్ సహకారం అమూల్యమైనది: పవన్ కల్యాణ్
Pawan Kalyan

అమరావతి, జులై 18 (ఆంధ్రజ్యోతి): కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు (Ashwini Vaishnaw) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ రైల్వే వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలోనూ, దేశ డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడంలోనూ అశ్విని వైష్ణవ్ చూపుతున్న అచంచలమైన నిబద్ధత అద్భుతమైనదని ప్రశంసించారు. దేశ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు.


ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైల్వే ప్రాజెక్టుల పురోగతికి కేంద్ర మంత్రి అందిస్తున్న నిరంతర సహకారాన్ని రాష్ట్ర ప్రజల తరఫున అభినందిస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. అశ్విని వైష్ణవ్‌కు మంచి ఆరోగ్యం, ఆనందం, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ, దేశసేవలో మరిన్ని విజయాలు సాధించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

విమాన ప్రయాణికులపై భారం పడనివ్వబోం: రామ్మోహన్

పలాస ఘటనలో తప్పు ఎవరూ చేసినా ఉపేక్షించబోం: హోం మంత్రి అనిత

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 18 , 2026 | 11:20 AM