Share News

తిరుపతి నైలిట్ సంస్థ మూసివేతపై క్లారిటీ.. అసలు విషయమిదే

ABN , Publish Date - Aug 30 , 2026 | 06:47 PM

తిరుపతి నైలిట్ సెంటర్ తరలింపు ప్రసక్తే లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. అమరావతిలో నైలిట్ క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది.

తిరుపతి నైలిట్ సంస్థ మూసివేతపై క్లారిటీ.. అసలు విషయమిదే
NIELIT

అమరావతి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నైలిట్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) సెంటర్ తరలింపు ప్రసక్తే లేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. అమరావతిలో నైలిట్ క్వాంటమ్ ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది. తిరుపతి కేంద్రాన్ని మూసివేయడం లేదని నైలిట్ సంస్థ ప్రకటన విడుదల చేసింది. తిరుపతి నైలిట్ తరలింపుపై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపింది. ప్రతి రాష్ట్రంలో గరిష్ఠంగా మూడు నైలిట్ కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఉందని వెల్లడించింది. అమరావతి రెండో నైలిట్ కేంద్రంగా ఏర్పాటు అవుతుందని చెప్పింది.


అమరావతి ఏఐ - క్వాంటమ్ సెంటర్‌కు సీఆర్డీఏ ఇప్పటికే అనుమతి ఇచ్చిందని నైలిట్ సంస్థ గుర్తుచేసింది. తిరుపతిలో తమ కార్యాకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. తిరుపతి నైలిట్‌లో ఇప్పటివరకు 4,308 మందికి శిక్షణ ఇచ్చినట్లు చెప్పింది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ కోర్సులు కొనసాగనున్నాయని వెల్లడించింది. వీఎల్ఎస్ఐ, ఎఫ్‌పీజీఎ, ఐఓటీ, రోబోటిక్స్ శిక్షణ కొనసాగనుందని వివరించింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్సులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.


ఆయా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ట్రైనింగ్ కార్యక్రమాలు కొనసాగుతాయని నైలిట్ సంస్థ వివరించింది. తిరుపతి కేంద్రాన్ని మరింత విస్తరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అదనంగా రెండు ఎకరాల స్థలం కేటాయిస్తే విస్తరిస్తామని ప్రకటించింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బలోపేతంతో శిక్షణ సామర్థ్యం పెంచనున్నట్లు వెల్లడించింది. కొత్త టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపింది. తిరుపతి కేంద్రం నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించింది. అమరావతి యూనివర్సిటీ క్వాంటమ్, ఏఐ పరిశోధనలకు కేంద్రంగా రూపుదిద్దుకోనుందని వివరించింది. తిరుపతి, అమరావతి రెండు క్యాంపస్‌లతో ఏపీ సాంకేతిక రంగానికి సమగ్ర ప్రయోజనం కల్పించనున్నట్లు నైలిట్ సంస్థ పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

సంజీవని గేమ్ చేంజర్‌గా మారుతుంది: సీఎం చంద్రబాబు

ఉద్యోగులను రెచ్చగొట్టేలా బొప్పరాజు వ్యవహరిస్తున్నారు: మంత్రి అనగాని

తెలుగు భాషకు గిడుగు రామమూర్తి చేసిన కృషి మరువలేనిది: సీఎం చంద్రబాబు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 30 , 2026 | 07:09 PM