Share News

గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల పనులు వేగవంతం చేయాలి: మంత్రి జనార్దన్ రెడ్డి

ABN , Publish Date - May 18 , 2026 | 04:54 PM

గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల పనులు వేగవంతం చేయాలని ఏపీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంలో సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.

గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల పనులు వేగవంతం చేయాలి: మంత్రి జనార్దన్ రెడ్డి
AP Minister Janardhan Reddy

అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల పనులు వేగవంతం చేయాలని ఏపీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (AP Minister Janardhan Reddy) అధికారులను ఆదేశించారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంలో సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, పిషింగ్ హార్బర్ల పురోగతిపై మంత్రి ఈరోజు (సోమవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని మూడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి.. అందుబాటులోకి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. గ్రీన్‌ఫీల్డ్ పోర్టు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని తెలిపారు.


మూలపేట పునరావాస కల్పనపై చర్చ..

పోర్టులు, ఫిషింగ్ హర్బర్‌ల నిర్మాణంలో ఏదైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే, పరిష్కరిస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ క్రమంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్‌ల పనులు మరింత వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేశారు. మూలపేట పోర్టుకు సంబంధించి ప్రధానంగా ఉప్పు భూముల సమస్య, రోడ్డు, రైల్వే, ఆర్ అండ్ ఆర్ వంటి మౌలిక సదుపాయాల కల్పన సమస్యలు పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. మూలపేట గ్రామానికి పునరావాస కల్పనను వేగవంతం చేయడం ద్వారా డ్రెడ్జింగ్‌ను సకాలంలో పూర్తి చేయడంతో పాటు, ఈ ఏడాది ఆఖరు నాటికి పోర్టు నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.


డ్రెడ్జింగ్ పనులు మరింత వేగవంతం చేయాలి..

మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టుకు సంబంధించి బ్రేక్ వాటర్, డ్రెడ్జింగ్ పనులు మరింత వేగవంతం చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. మచిలీపట్నం పోర్టుకు రైల్వే అనుసంధానం, విద్యుత్, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను చేపట్టిన క్రమంలో వాటిని సకాలంలో పూర్తి చేసేందుకు అధికారులు సహకరించాలని కోరారు. రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టులో డ్రెడ్జింగ్, పునరావాసం వంటి సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని మార్గనిర్దేశం చేశారు. మూడు గ్రీన్‌ఫీల్డ్ పోర్టులతో పాటు, ఫేజ్1 ఫిషింగ్ హర్బర్‌ల పనులు కూడా సకాలంలో పూర్తి చేయాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

పార్టీ పెట్టి ఉంటే కచ్చితంగా గెలిచేవాడిని: రజనీకాంత్

హైబ్రిడ్ మోడల్‌లో మహానాడు నిర్వహిస్తాం: పల్లా శ్రీనివాసరావు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 18 , 2026 | 05:06 PM