ఆర్నబ్ తుఫాన్ వేళ బాధితులకు భరోసాగా నిలిచిన మనమిత్ర
ABN , Publish Date - Oct 30 , 2026 | 08:54 PM
ఆర్నబ్ తుఫాన్ వేళ బాధితులకు భరోసాగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నిలిచింది. వాట్సాప్ గవర్నెన్స్‌ను సమర్థవంతంగా వినియోగించుకున్నామని బాధితులు తెలిపారు.1500లకు పైగా సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రజలు షేర్ చేశారు.
అమరావతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ వేళ బాధితులకు భరోసాగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ నిలిచింది. వాట్సాప్ గవర్నెన్స్‌ను సమర్థవంతంగా వినియోగించుకున్నామని బాధితులు తెలిపారు. 1500లకు పైగా సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అత్యధిక సమస్యలు మనమిత్రకు వచ్చాయి. కోనసీమలో 253, కాకినాడలో 247, తూర్పు గోదావరిలో 101, పశ్చిమ గోదావరిలో 159, విశాఖపట్నంలో 239, శ్రీకాకుళంలో 82 సమస్యలను ప్రజలు షేర్ చేశారు.
మనమిత్రకు వచ్చిన సమస్యను వచ్చినట్లే యుద్ధప్రాతిపదికన యంత్రాంగం పరిష్కరించింది. మనమిత్ర ద్వారా వచ్చిన ప్రతి సమస్యపై ప్రత్యేకంగా ఆర్టీజీఎస్ అధికారులు దృష్టి సారించారు. ప్రతి సమస్యపైనా ప్రత్యేకంగా ఆర్టీజీ కార్యదర్శి కాటంనేని భాస్కర్, సీఈఓ ప్రఖర్ జైన్ ఫోకస్ పెట్టారు. విపత్తుల వేళ హౌస్‌హోల్డ్ నేమ్‌గా మనమిత్ర నంబర్ - 9552300009 మారింది. తుఫాన్ సమయంలో మనమిత్రను తమ వాట్సాప్ డీపీ స్టేటస్‌గా ప్రజలు పెట్టుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: హోం మంత్రి అనిత
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News