జడ్పీటీసీ, ఎంపీటీసీ అర్హుల తుది జాబితా విడుదల
ABN , Publish Date - Oct 25 , 2026 | 09:11 PM
ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో అర్హుల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు విడుదల చేశారు. ఈ జాబితాలో 50,815 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు ప్రకటించారు.
అమరావతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో అర్హుల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు ఈరోజు (ఆదివారం) విడుదల చేశారు. ఈ జాబితాలో 50,815 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు ప్రకటించారు. ఎంపీటీసీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ- 19,760, వైసీపీ- 17,726, జనసేన -4,330, బీజేపీ -1,049 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని తెలిపారు. జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ -1,693, వైసీపీ -1,445, జనసేన - 587, కాంగ్రెస్ -316, బీజేపీ -227మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
విశాఖపట్నం మేయర్ పదవి ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు
మరోవైపు.. విశాఖపట్నం మేయర్ పదవి ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు నిలిచారని మేయర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.దయానిధి తెలిపారు. జీవీఎంసీ మేయర్ పదవి పోటీకి 29 నామినేషన్లు దాఖలు కాగా.. 8 నామినేషన్లు తిరస్కరించినట్లు చెప్పారు. అలాగే, 21 నామినేషన్లలో ఆరుగురు ఉపసంహరించుకున్నారని అన్నారు. నవంబర్ 1వ తేదీన పోలింగ్... నవంబర్ 3వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని రిటర్నింగ్ అధికారి దయానిధి పేర్కొన్నారు.
మేయర్ ఎన్నికలకు పోటీలో నిలిచిన 15 మంది పార్టీ, అభ్యర్థుల పేర్లు, గుర్తులిలా...
1. బహుజన సమాజ్ పార్టీ నుంచి కరణం కీర్తన గ్రేస్ - ఏనుగు గుర్తు.
2. భారత జాతీయ కాంగ్రెస్ నుంచి దేవర నాగ సునందా దేవి - చేతి గుర్తు.
3. తెలుగుదేశం పార్టీ నుంచి ముక్కా శ్రావణి - సైకిల్ గుర్తు.
4. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి వరుదు కల్యాణి - ఫ్యాన్ గుర్తు.
5. భారత చైతన్య యువజన పార్టీ నుంచి నమ్మి భవాని - బ్యాటరీ లైట్ గుర్తు.
6. స్వతంత్ర అభ్యర్థులుగా ఫ్రాన్సినమ్మ అత్తిలి - సీసా గుర్తు.
7. గొంప వెంకట పద్మావతి - కప్పు, సాసరు గుర్తు.
8. శైలజ తలుపుల - స్కూల్ బ్యాగ్ గుర్తు.
9. ప్రియాంక దండి - ఎయిర్ కండిషనర్ గుర్తు.
10. పకృతి దేవిక - ఉంగరం గుర్తు.
11. బోర సంతోషి - క్యాలీఫ్లవర్ గుర్తు.
12. లిఖిత లండ - కొవ్వొత్తుల గుర్తు.
13. వాoడ్రాసి శాంతి కుమారి - పల్లకి గుర్తు.
14. వియ్యపు ఉమ - ఫ్లూట్ గుర్తు.
15. షేక్ దౌలతున్నీసా - బీరువా గుర్తు
ఈ వార్తలు కూడా చదవండి..
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ
తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
కర్నూలు నగర అభివృద్ధి కోసం స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: మంత్రి టీజీ భరత్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News