నేడు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
ABN , Publish Date - Jul 31 , 2026 | 08:12 AM
ఏపీలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(సర్) - 2026 ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది.
ఆగస్టు 30లోపు అభ్యంతరాల దాఖలుకు అవకాశం
సెప్టెంబరు 28లోపు పరిష్కారం.. అక్టోబరు 3న తుది జాబితా
అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(సర్) - 2026 ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది. జాబితా విడుదలైన వెంటనే ప్రతి ఓటరు తమ పేరు, వ్యక్తిగత వివరాలు సక్రమంగా ఉన్నాయో లేవో పరిశీలించుకోవచ్చు. ఓటరు జాబితాలో పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులున్నా లేదా ఇతర లోపాలు కనిపించినా 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లైయిములు, అభ్యంతరాలు దాఖలు చేసుకునే అవకాశం ఎన్నికల సంఘం కల్పించింది.
ముసాయిదా జాబితా ceoandhra.nic.in వెబ్‌సైట్‌లో జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ల వారీగా పీడీఎ్‌ఫల రూపంలో ముసాయిదా ఓటర్ల జాబితా అందుబాటులో ఉంచుతారు. అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల అధికారి కార్యాల యం, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కార్యాలయాలు, బీఎల్‌వోల వద్ద ఈ జాబితాలు అందుబాటులో ఉంటాయి. అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఈ జాబితాలను ఉంచుతారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో ముందుగా మీ పేరు ఉందో లేదో పరిశీలించుకోవాలి. తరువాత పేరు స్పెల్లింగ్‌తో పాటు ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. స్వీకరించిన అభ్యంతరాల ను ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 28 లోపు పరిష్కరిస్తారు. అక్టోబరు 3న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు.
వార్తలు కూడా చదవండి...
హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు
గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News