Share News

ఆర్నబ్ తుఫాన్ ప్రభావం.. పలు విమానాలు, రైళ్ల రద్దు

ABN , Publish Date - Oct 27 , 2026 | 03:50 PM

ఆర్నబ్ తుఫాన్ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు విమానాలు, రైళ్లు రద్దు అయ్యాయి. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆర్నబ్ తుఫాన్ ప్రభావం.. పలు విమానాలు, రైళ్ల రద్దు
Cyclone Arnab

అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు విమానాలు, రైళ్లు రద్దు అయ్యాయి. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు ఈరోజు (మంగళవారం) రావాల్సిన ఇండిగో విమానాలను అధికారులు రద్దు చేశారు. చెన్నై- విజయవాడ , బెంగళూరు- విజయవాడ విమానాలను రద్దు చేశారు.


రైళ్ల రద్దు..

అలాగే, ఆర్నబ్ తుఫాన్ కారణంగా భారీగా రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఇవాళ(మంగళవారం), రేపు (బుధవారం) విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే 45 రైళ్లను రద్దు చేసినట్లు విశాఖపట్నం వాల్తేరు డివిజన్ అధికారులు తెలిపారు. వందేభారత్, గరీబ్‌రథ్, ఫలక్‌నుమా, గోదావరి, ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ప్రధాన రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అర్నబ్ తుఫాన్ గమనంపై నిరంతర నిఘా.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

అర్నబ్ తుఫాన్.. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

ఏపీకి కేంద్రం భారీ సాయం.. రూ.27, 370 కోట్ల గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టుకు ఆమోదం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 27 , 2026 | 04:05 PM