Share News

గనులు, ఎక్సైజ్ శాఖల లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలి: సీఎం

ABN , Publish Date - May 14 , 2026 | 05:43 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వివిధ శాఖలపై గురువారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంపై చర్చించారు.

గనులు, ఎక్సైజ్ శాఖల లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలి: సీఎం
AP CM Chandra babu Naidu

అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) అధ్యక్షతన వివిధ శాఖలపై ఈరోజు (గురువారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వివిధ శాఖలకు సీఎం దిశానిర్దేశం చేశారు. స్టేట్ ఓన్ రెవెన్యూస్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.1,04,345 కోట్లుగా ఉంటే... 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,10,643 కోట్లుగా నమోదైందని వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ నుంచి రూ.33,679 కోట్లు, గనుల శాఖ నుంచి రూ. 10,300 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి రూ.11,047 కోట్ల మేర ఆదాయం వచ్చిందని తెలిపారు.


2024-25 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో స్టేట్ ఓన్ రెవెన్యూలో 6 శాతం వృద్ధి నమోదైందని సీఎం వివరించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.1,27,506 కోట్ల మేర ఆదాయాన్ని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుందని వెల్లడించారు. గనులు, ఎక్సైజ్, స్టాంపులు రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, రవాణా తదితర శాఖలు లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయంలో ప్రతీ రూపాయీ సద్వినియోగం అయ్యేలా ప్రభుత్వ శాఖలు చూడాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.ఈ సమీక్షకు సీఎస్ సాయిప్రసాద్, ఆర్ధిక, రవాణా, ఎక్సైజ్, గనులు, స్టాంపులు రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నులు, అటవీ, పురపాలక శాఖల అధికారులు హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి...

దుబారా ఖర్చులను తగ్గిద్దాం.. సీఎం చంద్రబాబు పిలుపు

ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం.. భారత్‌నెట్ అమలుకు చరిత్రాత్మక ఒప్పందం

నా కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదు: రఘురామ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 14 , 2026 | 06:02 PM