ఏపీకి మరో తుఫాన్ ముప్పుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 31 , 2026 | 04:52 PM
రాష్ట్రానికి మరో తుఫాన్ ముప్పుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. తుఫాన్ గమనంపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని ఆదేశించారు.
అమరావతి, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి మరో తుఫాన్ ముప్పుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) దిశానిర్దేశం చేశారు. తుఫాన్ గమనంపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని ఆదేశించారు. ఆర్నబ్ తుఫాన్ విధ్వంసం అనంతరం జరుగుతోన్న పునరుద్ధరణ పనులు, వాతావరణ పరిస్థితులపై సీఎం చంద్రబాబు ఈరోజు (శనివారం) సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రంలో సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంవాలపై ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడినట్లుగా సీఎంకు అధికారులు వివరించారు. రేపటికి ఈ వాయుగుండం తుఫాన్‌గా బలపడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోని గుంటూరు నుంచి దిగువ ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో వర్షాలకు ఆస్కారం ఉందని అధికారులు తెలిపారు. నవంబర్ 2, 3, 4 తేదీల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపగ్రహ చిత్రాలు, డాప్లర్, రాడార్ల సాయంతో ముందస్తుగా తుఫాన్ గమనాన్ని అంచనా వేసి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమీక్షకు ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్, విద్యుత్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సహా వివిధ టెలికాం ఆపరేటర్ల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా.. ప్రతి బాధితుడికి న్యాయం: సీఎం చంద్రబాబు
మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి: పవన్ కల్యాణ్
స్థానిక ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు: ఏపీ ఎస్‌ఈసీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News