అగ్రిగోల్డ్ కేసు.. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలి: సీఎం ఆదేశం
ABN , Publish Date - May 14 , 2026 | 04:20 PM
అగ్రిగోల్డ్ బాధితులకు ఆరునెలల్లో న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
అమరావతి , మే 14 (ఆంధ్రజ్యోతి): అగ్రిగోల్డ్ బాధితులకు ఆరునెలల్లో న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఆదేశించారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సీఎం అధ్యక్షతన ఈరోజు (గురువారం) సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు.
ముగ్గురు సభ్యులతో కమిటీ..
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడానికి సంబంధించి ముగ్గురు సభ్యులతో కమిటీ వేయాలని సీఎం ఆదేశించారు. ఎనిమిది రాష్ట్రాల్లో 19 లక్షల మంది బాధితులు ఉన్నారని తెలిపారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 11 లక్షల మంది బాధితులు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ కేసులో బాధితుల సొమ్ము తిన్న వారిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని కొంతమంది కీలక అధికారులు ఉన్నారని వెల్లడించారు. అందువల్లే ఈ కేసుపై ముగ్గురు సభ్యులతో కమిటీ వేయాలని ఆదేశించారు. అగ్రిగోల్డ్‌లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారందరికీ తప్పనిసరిగా న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దుబారా ఖర్చులను తగ్గిద్దాం.. సీఎం చంద్రబాబు పిలుపు
ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం.. భారత్‌నెట్ అమలుకు చరిత్రాత్మక ఒప్పందం
నా కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదు: రఘురామ
Read Latest AP News And Telangana News And International News And Telugu News