Share News

రాయపూడి ఘటన.. ప్రమాదమా, కుట్రకోణమా.. విచారణ చేయండి: సీఎం

ABN , Publish Date - Mar 24 , 2026 | 01:43 PM

రాజధాని అమరావతిలోని ప్రాంతం రాయపూడిలో నిన్న(సోమవారం) రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఈరోజు(మంగళవారం) రివ్యూ నిర్వహించారు. రాయపూడిలో హెచ్‌వోడీ టవర్ల నిర్మాణం వద్ద మెగా సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు రాత్రి దగ్ధమైన ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకి అధికారులు వివరించారు.

రాయపూడి ఘటన.. ప్రమాదమా, కుట్రకోణమా.. విచారణ చేయండి: సీఎం
CM Chandra babu Naidu

అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలోని ప్రాంతం రాయపూడిలో నిన్న(సోమవారం) రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra babu Naidu) సచివాలయంలో ఈరోజు(మంగళవారం) రివ్యూ నిర్వహించారు. రాయపూడిలో హెచ్‌వోడీ టవర్ల నిర్మాణం వద్ద మెగా సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు రాత్రి దగ్ధమైన ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.


రాజధాని ప్రాంతంలో తరుచూ అగ్రిప్రమాదాలు జరగడంపై సీఎం అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రమాదమా, కుట్రకోణం ఉందా అనే విషయంలో సమగ్ర విచారణ జరపాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే మూడు ఘటనల్లో వివిధ కాంట్రాక్టు సంస్థలకు చెందిన నిర్మాణ సామగ్రి దగ్ధమైందని తెలిపారు. ఈరోజు సాయంత్రం సీఆర్డీఏ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఏం జరిగిందంటే..

రాజధాని అమరావతిలోని రాయపూడి వద్ద నూతనంగా నిర్మిస్తున్న అఖిల భారత సర్వీస్ అధికారుల టవర్ల సమీపంలో పైపులు కాలిపోయాయి. ఇది ప్రమాదమా లేక కుట్రకోణమా అనే దానిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల వెలగపూడి సమీపంలో సీడ్ యాక్సిస్ రోడ్ వద్ద కొందరు ఉద్దేశపూర్వకంగా పైపులకు నిప్పుపెట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. జాబ్ క్యాలెండర్, ఉద్యోగ సమస్యలపై వినతులు

అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐకానిక్ కట్టడాలు: మంత్రి నారాయణ

నా కుమారుడు మహేశ్‌ యాదవ్‌కు ఎలాంటి డ్రగ్స్‌ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 24 , 2026 | 03:25 PM