గ్రామాలకు మహర్దశ.. పల్లె పండుగ 3.0 కింద రూ. 11 వేల కోట్లతో పనులు
ABN , Publish Date - Sep 27 , 2026 | 02:41 PM
పల్లెల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి వెలుగులు నింపనుంది. ఈ నెల 29వ తేదీన పల్లె పండుగ 3.0కి శ్రీకారం చుట్టనుంది.
అమరావతి, సెప్టెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) అభివృద్ధి వెలుగులు నింపనుంది. ఈ నెల 29వ తేదీన పల్లె పండుగ 3.0కు శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా రూ.11,085 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున అభివృద్ధి పనులు జరుగనున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభం కానున్నాయి. గ్రామాల్లో రూ. 2,700 కోట్ల వ్యయంతో 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం జరగనుంది. రూ.7,550 కోట్ల వ్యయంతో 9,500 కిలోమీటర్ల బీటీ రోడ్ల పనులను చేపట్టనుంది. రూ.300 కోట్లతో పాడి రైతుల కోసం 22,000 మిని గోకులాలను ఏపీ సర్కార్ నిర్మించనుంది.
రూ. 225 కోట్ల వ్యయంతో ఉద్యానవన శాఖ ద్వారా 50,000 ఎకరాల్లో తోటల పెంపకానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రూ.110 కోట్ల వ్యయంతో 1,000 కిలోమీటర్ల మేజిక్ డ్రెయిన్లు నిర్మాణాన్ని చేపట్టనుంది. రూ. 200 కోట్లతో బస్ షెల్టర్లు, గ్రామ పంచాయతీ భవనాలు, రచ్చబండ తదితర పనులు జరగనున్నాయి. మొత్తం రూ.11,085 కోట్లతో కేంద్రం వాటాగా రూ.5,391 కోట్లు, రాష్ట్రం వాటా రూ.5,694 కోట్లను ఖర్చు చేయనుంది. వీబీ–జీ రామ్ జీ కింద రూ.1,750 కోట్లు, గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కింద రూ.3,800 కోట్లు, నాబార్డ్, సాస్కీ, ఇతర నిధులతో రూ.2,000 కోట్లతో ఆయా పనులను ప్రభుత్వం చేపట్టనుంది.
పల్లె పండుగ 1.0 కింద 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 22,514 పశువుల షెడ్లు, 21,000 వ్యవసాయ పంట కుంటలు, 64 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల పెంపకాన్ని పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ శాఖ చేపట్టింది. పల్లె పండుగ 2.0 కింద రూ. 2,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 8 వేల 300 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 15750 పశువుల షెడ్లు, 15,500 పశువుల నీటి తొట్టెలు, 86 వేల వ్యవసాయ కుంటలు, 82 వేల వ్యక్తిగత సోక్ పిట్లు, 32 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్లను ఏపీ ప్రభుత్వం నిర్మించనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అదానీ గ్రూప్ ఎనర్జీ మానిటరింగ్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి లోకేశ్
స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యం: మంత్రి పార్థసారథి
కర్నూలు ఎయిర్‌పోర్టు వేదికగా ఏవియేషన్ శిక్షణ: మంత్రి జనార్దన్ రెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News