బీసీ రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబు స్పందన
ABN , Publish Date - Oct 01 , 2026 | 03:08 PM
బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎన్టీఆర్ కాలం నుంచి బీసీలకు అండగా ఉన్నామని అన్నారు.
బాపట్ల, అక్టోబర్ 1: బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎన్టీఆర్ కాలం నుంచి బీసీలకు అండగా ఉన్నామని అన్నారు. పేదలకు సేవలో కార్యక్రమంలో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను తాము అమలు చేశామని చెప్పారు. గొడ్డలి పార్టీ రిజర్వేషన్లను కత్తిరించి 24 శాతానికి తగ్గించిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ 34 శాతానికి రిజర్వేషన్లను పెంచామన్నారు. దీనిపై గొడ్డలి పార్టీ కోర్టుకు వెళ్లి రిజర్వేషన్లు అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్లు తెలిపారు.
బీసీ వర్గాలకు ఆర్థికంగా, రాజకీయంగా పైకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వని వారు డీఎస్సీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. డీఎస్సీపై 300 కేసులు వేసి అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు. ఇపుడు బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్రలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని ధర్మాసనం స్పష్టం చేశారు. దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పోరాడాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే సోమవారంలోగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై ఇప్పటికే అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు సీనియర్ న్యాయనిపుణులతో సీఎం మాట్లాడారు.
ఇవి కూడా చదవండి...
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు.. సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశం
ప్రభుత్వ విధానాలను మార్చి పేదలకు సేవ చేయటమే నా బాధ్యత: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News