Share News

మలి వయసులో.. తల్లడిల్లే మనసు..

ABN , Publish Date - Oct 01 , 2026 | 01:44 PM

బుక్కెడు బువ్వ పెట్టడానికి వంతుల వారీగా పంచు కుంటున్నారు. ఊతమివ్వాల్సిన వయస్సులో వారి ఊత కర్రను లాగేస్తున్నారు. ఇక మీ అవసరం లేదని వక్ర బుద్ధితో ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు.

మలి వయసులో.. తల్లడిల్లే మనసు..
International Day of Older Persons

  • ఉమ్మడి జిల్లాలో చిన్నబోతున్న పెద్దరికం

  • వయోధికులపై పెరుగుతున్న నిరాదరణ

  • నేడు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

బుక్కెడు బువ్వ పెట్టడానికి వంతుల వారీగా పంచు కుంటున్నారు. ఊతమివ్వాల్సిన వయస్సులో వారి ఊత కర్రను లాగేస్తున్నారు. ఇక మీ అవసరం లేదని వక్ర బుద్ధితో ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు. తప్పనిసరై ఇంట్లో ఉండాల్సిన పరిస్థితుల్లో ఈసడింపులు, చీత్కారాలతో వారిని దెప్పిపొడుస్తున్నారు. ఇవన్నీ నేటి సమాజంలో వృద్ధులైన తమ ఇంటి పెద్దల విషయంలో కొందరు అనుసరిస్తున్న విధానాలు. నేడు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని


పరిస్థితులపై కథనం..

కన్నీటి పర్యంతమవుతూ..

  • 21 సెప్టెంబరు, 2026న జగిత్యాల కలెక్టరేట్‌కు వచ్చిన వృద్ధదంపతులు తమకు తమ పిల్లలతో ప్రాణ హాని ఉందంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

  • 19 సెప్టెంబరు, 2026న కరీంనగర్‌లోని కోతి రాం పూర్‌కు చెందిన వృద్ధులు కొడుకు ఇంటి నుంచి వెళ్లి పొమ్మంటున్నాడని జిల్లా అధికారులను ఆశ్రయించారు.

  • 17 జూలై, 2026న జగి త్యాల జిల్లా ఎండ పల్లికి చెందిన వృద్ధ దంపతులు తాము అనా రోగ్యంతో ఉన్నామని అయినవాళ్లు పోషించడం లేదని ఆర్డీవో వద్దకొచ్చారు.

  • 2023లో 117 మంది, 2024లో 129 మంది, 20 25లో 120, 2026లో ఇప్పటి వరకు 55 మంది వృద్ధులు ఆర్డీవో కార్యాలయాలకు న్యాయం కోసం వచ్చారు.


చట్టం ఉన్నా ఉపయోగమేది..?

వృద్ధుల పోషణ చట్టం-2007లో వచ్చి దాదాపు 20 ఏళ్లు దగ్గరవుతున్నా పండుటాకులకు ఆసరా లభించడం లేదు. వికలాంగుల సంక్షేమశాఖ పర్య వేక్షణలో తల్లిదండ్రులను ఆదరించని వారికి 10 వేల వరకు జరిమానా విధిస్తారు. వారి పోషణ, వైద్యానికి అయ్యే ఖర్చులను భరించాలనే ఆదేశాలిస్తారు. ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేసే విషయంలో రెవె న్యూ, పోలీసు శాఖల మధ్య సమన్వయలోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 29,97,973 మంది ఓటర్లుండగా 60 ఏళ్లకు పైబడిన వారి సం ఖ్య 25 శాతానికిపైగా ఉంటుంది.

ప్రస్తుతం ఆసరా పింఛన్‌ను అందుకునేవారు 2.02 లక్షల మంది ఉం డగా పింఛన్‌ అందని వారు రెండు లక్షల కుపైగా ఉంటారు.


xx.jpgఆదర్శంగా..

  • సిరిసిల్లలోని సుభా ష్‌ నగర్‌లోని ప్రణామ్‌ డేకేర్‌ సెంటర్‌ వయో వృద్ధులకు వరంగా మారింది. పలువురు ఇక్కడ నిత్యం ఆహ్లాదంగా గడుపుతున్నారు.

  • వయస్సు పైబడిన వారి కోసం ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆశ్ర మాలు, సంరక్షణ కేంద్రాలు సుమారు 30కిపైగా ఏర్పాట య్యాయి. ఇందులో 400కుపైగా వృద్ధులుంటున్నారు.

  • నాలుగు జిల్లాల్లో రిటైర్డ్‌ ఉద్యో గుల సంక్షేమ సంఘాలు పలు కార్య క్రమాల్ని తరచూ నిర్వహిస్తున్నాయి.


ఆసరా పింఛన్‌ పొందేవారు..

జిల్లా - వృద్ధులు

కరీంనగర్‌ 58,403

జగిత్యాల 65,689

పెద్దపల్లి 43,810

సిరిసిల్ల 34,382

మొత్తం 2,02,284


వెంటాడుతున్న సమస్యలు..

వయస్సు మీదపడిన కొద్దీ శారీరక రుగ్మతలు పెరుగుతున్నాయి. కుంగుబాటు, ఆత్మన్యూనత భావం పెరుగుతుంది. అల్జీ మర్స్‌తో మతిమరుపు అధికమవు తుంది. తోడుగా ఉండే భర్త లేదా భార్యను కోల్పోయిన వారి జీవితం మరింత కష్టమ వుతోంది. చూపు, వినికిడి సమస్యలు పెరుగుతుండడం, ఒంట్లో శక్తి లేక కిందపడుతూ గాయాలవుతున్న వారే ఎక్కువగా ఉంటున్నారు. ఆస్తి వివా దాలు, పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఉండడం వల్ల వృద్ధులు కన్నబిడ్డలకు దూరమవుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

పట్టభద్రుల ఎన్నికలు.. కొత్త మండలాల గుర్తింపు

హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌లో 10 రైళ్లకు తాత్కాలిక హాల్ట్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 01:44 PM