సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్..
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:09 PM
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాముడు, శివుడి విషయంలో సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 1: ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాముడు, శివుడి విషయంలో సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. రేవంత్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సోనియాగాంధీ కుటుంబం మెప్పు కోసమే.. వారి కుటుంబం కోసం ప్రాణత్యాగం చేస్తానంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో రాముడు వేరు.. శివుడు వేరు అన్నట్టుగా మాట్లాడటం సరికాదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టకుండా మతాలు, దేవుళ్ల అంశాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. హిందూ సమాజంలో ప్రజలు వివిధ దేవుళ్లను ఆరాధిస్తారని, దేవుళ్ల విషయంలో విభజనకు తావు ఇవ్వకూడదని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినట్లే రేవంత్‌రెడ్డి కూడా రాజకీయ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎదుర్కొంటున్న వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు చేస్తున్నారని, కులాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
నేడు బాపట్లలో సీఎం పర్యటన.. చంద్రబాబు చేతుల మీదుగా కొత్త పింఛన్ల పంపిణీ
అరకు కాఫీని గౌరవించుకోవడం గర్వకారణం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News