Share News

పైలట్ మచ్చార్ ధైర్యసాహసాలు దేశానికి గర్వకారణం: ప్రధాని మోదీ

ABN , Publish Date - Oct 01 , 2026 | 12:18 PM

ఫ్లైదుబాయ్ విమానంలో దుండగుడి దాడిలో గాయపడి.. 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్ కుటుంబంతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మాట్లాడారు. ఈ సందర్భంగా మచ్చార్ ధైర్యసాహసాలను ప్రధాని కొనియాడారు

పైలట్ మచ్చార్ ధైర్యసాహసాలు దేశానికి గర్వకారణం: ప్రధాని మోదీ

ఇంటర్‌నెట్ డెస్క్: ఫ్లైదుబాయ్ విమానంలో దుండగుడి చేతిలో గాయపడి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్ కుటుంబంతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మాట్లాడారు. మచ్చార్ భార్య, తల్లిదండ్రులను ఆయన పలకరించారు. ఈ సందర్భంగా మచ్చార్ ధైర్యసాహసాలను ప్రధాని కొనియాడారు.


‘దుండగుడి చేతిలో గాయపడినా.. మచ్చార్ తన ప్రాణాలకు తెగించి పోరాడారు. శరీరం రక్తమోడుతున్నా దుండగుడితో పోరాడుతూనే కాక్‌పిట్ డోర్ తెరిచారు. దీంతో విమాన ప్రయాణికులు, సిబ్బంది లోపలికి రావడానికి వీలు కలిగింది. తర్వాత వారంతా ఆ దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. లేకపోతే పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. విమానయాన చరిత్రలో మరో ఘోరం జరిగి ఉండేది. ఆ సమయంలో మచార్ చూపిన ధైర్యం, తెగువ అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన వల్లే 174 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వారి కుటుంబాల్లో ఆయన సంతోషం నింపారు’ అని మోదీ పేర్కొన్నారు. దుండగుడితో పోరాడుతూ గాయపడిన మచ్చార్‌కు అవసరమైన సాయం అంతా చేస్తామని మోదీ భరోసా ఇచ్చారు. కాగా.. అంతకుముందు కూడా మచ్చార్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ప్రధాని ఎక్స్‌లో పోస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఇంధన నౌక హైజాక్‌

రష్యాపై ఉక్రెయిన్‌ ‘జాంబీ కార్ల’ యుద్ధం

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 01 , 2026 | 12:24 PM