రష్యాపై ఉక్రెయిన్ ‘జాంబీ కార్ల’ యుద్ధం
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:08 AM
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో రకరకాల ప్రయోగాలు చేస్తున్న ఉక్రెయిన్ తాజాగా ‘జాంబీ కార్ల’ను రంగంలోకి దించింది. సోవియట్ యూనియన్ కాలం నాటి యుద్ధశకటాలను మానవ రహిత, సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలుగా మలిచి, వాటిలో పేలుడు పదార్థాలు నింపి రష్యా బలగాలపైకి పంపుతోంది.

సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలుగా సోవియట్ నాటి యుద్ధ శకటాల రూపకల్పన
రష్యా సైన్యం ఆధీనంలో
ఉన్న పట్టణంపైకి జాంబీ కార్ల దండు
లక్ష్యం చేరగానే పేల్చివేసుకున్న కార్లు..
ఇదే అదనుగా ఉక్రెయిన్ దాడి
ఓ పట్టణం, 3 గ్రామాలు విముక్తి
కీవ్, సెప్టెంబరు 30: రష్యాతో జరుగుతున్న యుద్ధంలో రకరకాల ప్రయోగాలు చేస్తున్న ఉక్రెయిన్ తాజాగా ‘జాంబీ కార్ల’ను రంగంలోకి దించింది. సోవియట్ యూనియన్ కాలం నాటి యుద్ధశకటాలను మానవ రహిత, సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలుగా మలిచి, వాటిలో పేలుడు పదార్థాలు నింపి రష్యా బలగాలపైకి పంపుతోంది. ‘ఆపరేషన్ వివాల్ది’ పేరుతో సోమవారం నిర్వహించిన సైనిక ఆపరేషన్‌లో ఈ జాంబీ కార్లను ఉపయోగించి.. రష్యా సైనికుల ఆక్రమణలో ఉన్న ఓ కీలక పట్టణాన్ని, మూడు గ్రామాలను విముక్తి చేసింది. అంతేకాదు, 250 మంది రష్యా సైనికులను అదుపులోకి తీసుకుంది. సోవియట్ యూనియన్ కాలంలో తయారైన బీటీఆర్-60 యుద్ధశకటాలను ఉక్రెయిన్ సైనిక ఇంజినీర్లు సెల్ఫ్‌డ్రైవింగ్ వాహనాలుగా మలిచారు. వీటిని ఒక దళంగా రష్యా సైనికులకు గట్టి పట్టు ఉన్న నోవ్ అనే పట్టణంపైకి పంపించారు. లక్ష్యం వద్దకు చేరిన వెంటనే బీటీఆర్-60 జాంబీకార్లు తమను తాము పేల్చివేసుకోవటంతో రష్యా సైనికులు కకావికలమయ్యారు. ఇదే అదనుగా వారి మీద ఉక్రెయిన్ దళాలు విరుచుకుపడ్డాయి.
250 మంది రష్యా సైనికులను అదుపులోకి తీసుకోవటమేగాక నోవ్‌తోపాటు సమీపంలోని 3 గ్రామాలను తిరిగి తమ అధీనంలోకి తీసుకున్నాయి. జాంబీకార్లు బురద, ఎగుడుదిగుడు ఉపరితలం ఉన్న నేల మీది నుంచి వెళ్తూ నోవ్ పట్టణంలోకి వెళ్లి పేల్చుకున్న వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. తమ 3వ ఆర్మీ కార్ప్స్ దళం ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగిందని ఉక్రెయిన్ ప్రకటించింది. ‘రష్యన్లు ఎన్నటికీ లొంగరు’ అనే నినాదం సినిమాలకే పరిమితమని.. ఆఫీసర్లు, పైలట్లు, సైనికులు సహా యావత్ ఆర్మీ యూనిట్లు తమకు లొంగిపోయాయని ఆపరేషన్‌కు సారథ్యం వహించిన బ్రిగేడియర్ జనరల్ ఆండ్రీ బెలెట్స్కీ వెల్లడించారు. రష్యా సైన్యం అదుపులో ఉన్న తమ సైనికులను విడుదల చేస్తే, తాము పట్టుకున్న రష్యా సైనికులను విడుదల చేస్తామని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో దాదాపు 2 వేల మంది రష్యా సైనికులు మరణించటమో గాయపడటమో జరిగి ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు టెలిగ్రాంలో ఆయన ఒక వీడియో విడుదల చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
సూపర్ ఇంటెలిజెన్స్.. ఏఐకి కొత్త పేరును ప్రకటించిన ట్రంప్
విమానాన్ని కూల్చేందుకు పైలట్ ప్రయత్నించాడా..