విమానాన్ని కూల్చేందుకు పైలట్ ప్రయత్నించాడా..
ABN , Publish Date - Sep 30 , 2026 | 05:45 PM
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విమానం నుంచి తొలుత అత్యవసర సంకేతం, ఆ తర్వాత 7500 హైజాక్ కోడ్ ప్రసారం కావడంతో ఇజ్రాయెల్ అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విమానం నుంచి తొలుత అత్యవసర సంకేతం, ఆ తర్వాత 7500 హైజాక్ కోడ్ ప్రసారం కావడంతో ఇజ్రాయెల్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దించారు. చివరకు విమానం సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది (Dubai Tel Aviv flight).
ఈ ఘటనపై వెలువడుతున్న తాజా నివేదికలు మరింత సంచలన విషయాలను వెల్లడిస్తున్నాయి. విమానంలోని ఇద్దరు పైలట్ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిందని, ఒక పైలట్ మరో పైలట్‌పై దాడి చేసినట్లు ప్రయాణికులు చెప్పారు. ఒక పైలట్ ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్టు భావిస్తున్నారు (Pilot tried to crash plane).
కాక్‌పిట్ వైపు నుంచి అరుపులు వినిపించాయని, అనంతరం రక్తం కనిపించిందని కొందరు ప్రయాణికులు చెప్పినట్టు తెలుస్తోంది (Flydubai incident). ఒక పైలట్ మరో పైలట్‌పై కత్తితో దాడి చేశాడని కూడా ప్రయాణికులు పేర్కొన్నట్టు సమాచారం. ఒక పైలట్ విమానంపై నియంత్రణ సాధించి దాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడని, మరో పైలట్, ఇతర సిబ్బంది అతడిని అడ్డుకున్నారని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన తర్వాత తబూక్ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు.
ఇవి కూడా చదవండి..
అక్టోబర్ 2 నుంచి 'సేవ్ డెమోక్రసీ' మార్చ్.. సీఈసీపై ఇండియా కూటమి నిరసనలు..
రెండు నిమిషాల్లో 17 వేల అడుగుల కిందకు.. దుబాయ్-టెల్ అవీవ్ విమానంలో ఏం జరిగింది..