Share News

అక్టోబర్ 2 నుంచి 'సేవ్ డెమోక్రసీ' మార్చ్.. సీఈసీపై ఇండియా కూటమి నిరసనలు..

ABN , Publish Date - Sep 30 , 2026 | 03:28 PM

ఓటర్ల జాబితా సవరణ అంశంపై ఎన్నికల సంఘంతో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 2 నుంచి 8 వరకు వారం రోజుల పాటు 'సేవ్ డెమోక్రసీ' మార్చ్ నిర్వహించనున్నట్లు కూటమి నేతలు ప్రకటించారు.

అక్టోబర్ 2 నుంచి 'సేవ్ డెమోక్రసీ' మార్చ్.. సీఈసీపై ఇండియా కూటమి నిరసనలు..
INDIA bloc Save Democracy March

ఇంటర్నెట్ డెస్క్: ఓటర్ల జాబితా సవరణ (SIR) అంశంపై ఎన్నికల సంఘంతో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 2 నుంచి 8 వరకు వారం రోజుల పాటు 'సేవ్ డెమోక్రసీ' మార్చ్ నిర్వహించనున్నట్లు కూటమి నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి (Save Democracy March).


న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఇండియా కూటమి నేతల సమావేశం జరిగింది. అక్టోబర్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలో 'సేవ్ డెమోక్రసీ' పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. అక్టోబర్ 6న కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పాదయాత్ర చేపట్టబోతున్నట్టు తెలిపారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తమ నిరసన గురించి వివరిస్తామని చెప్పారు. ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్‌ పేపర్లను వినియోగించాలని కూటమి నేతలు డిమాండ్‌ చేశారు (INDIA bloc SIR row).


భారత ప్రజాస్వమ్యాన్ని బతికించేందుకు ఇండియా బ్లాక్ నాయకులు వ్యక్తిగతంగా కట్టుబడి ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన వారికి శిక్ష పడేలా చూడాలని ఇండియా కూటమి నాయకులందరూ కోరుకుంటున్నట్టు తెలిపారు. 'వారు ఎంత పెద్ద వారైనా, ఎంత ఉన్నతాధికారులైనా.. వారి కంటే భారత ప్రజాస్వామ్యం గొప్పది' అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

డేటింగ్‌ యాప్‌లో పరిచయం.. పబ్‌లో రూ.29,884 బిల్లు!

స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పిన పోరాటం ‘సాగరహారం’: కేటీఆర్

Updated Date - Sep 30 , 2026 | 03:28 PM