Share News

పట్టభద్రుల ఎన్నికలు.. కొత్త మండలాల గుర్తింపు

ABN , Publish Date - Oct 01 , 2026 | 10:05 AM

ఓటర్‌ నమోదు షెడ్యూల్‌ విడుదల నేపథ్యంలో పట్టభద్రుల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సన్నాహాక చర్యలకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది.

పట్టభద్రుల ఎన్నికలు.. కొత్త మండలాల గుర్తింపు
Graduate MLC

  • సమాచారం సేకరిస్తున్న జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌ సిటీ: ఓటర్‌ నమోదు షెడ్యూల్‌ విడుదల నేపథ్యంలో పట్టభద్రుల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సన్నాహాక చర్యలకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో గతంలో ఓటర్లు, పోలింగ్‌ కేంద్రాల లెక్కలు తీసిన ఎన్నికల విభాగం అధికారులు.. వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. 2021లో జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గంలో 5,31,268 మంది ఓటర్లు ఉండగా, 799 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.


కనీసంగా మండలానికి ఒక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతుండగా, 1000 కంటే ఎక్కువ మంది ఉన్న మండలాల్లో సంఖ్యను బట్టి అదనపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 2022 సెప్టెంబరులో రాష్ట్రవ్యాప్తంగా 13 నూతన రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలో 2021 అనంతరం కొత్తగా ఏర్పడిన మండలాల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పడిన మండలాలు లేనప్పటికీ ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో సమాచారం ఇవ్వాలని అక్కడి జిల్లా (కొత్త జిల్లాలు) కలెక్టర్లకు సూచించారు.


ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కొత్తగా కౌకుంట్ల మండలం ఏర్పాటయినట్టు చెబుతున్నారు. 2015 ఎన్నికల సమయంలో 2.91 లక్షల ఓటర్లు ఉండగా, 2021లో ఓటర్ల సంఖ్య 5.31 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం ఓటర్లు మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 28వ తేదీన ప్రారంభమైన పట్టభద్రుల ఓటర్‌ నమోదు నవంబరు 6వ తేదీ వరకు కొనసాగనుంది. ఫిబ్రవరిలో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశముందని, మార్చిలో ఎన్నికలుంటాయని చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు.. నేటి రేట్స్ ఇవీ

హైటెక్‌ సిటీ రైల్వేస్టేషన్‌లో 10 రైళ్లకు తాత్కాలిక హాల్ట్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 10:12 AM