Share News

కదులుతున్న రైలు దిగేందుకు మహిళ ప్రయత్నం.. అంతలోనే..

ABN , Publish Date - Oct 01 , 2026 | 07:20 AM

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌లో కదులుతున్న రైలు దిగుతూ ప్రమాదానికి గురైన ఓ మహిళను ఆర్‌పీఎస్‌ఎఫ్ సిబ్బంది చాకచక్యంగా రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కదులుతున్న రైలు దిగేందుకు మహిళ ప్రయత్నం.. అంతలోనే..
Prayagraj Junction

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌లో పెను ప్రమాదం తప్పింది. ప్లాట్‌ఫామ్‌ నంబర్‌ 1పై నుంచి ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్‌ కదులుతున్న సమయంలో రైలు దిగేందుకు ప్రయత్నించిన ఓ మహిళ అదుపుతప్పి రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో పడిపోయింది. వెంటనే స్పందించిన ఆర్‌పీఎస్‌ఎఫ్‌ 2వ బెటాలియన్‌కు చెందిన ఏఎస్‌ఐ మహేష్ కుమార్ హరిత్వాల్, కానిస్టేబుళ్లు ప్రవేశ్ కుమార్, బసంత్ అత్యవసర గొలుసును లాగి రైలును నిలిపివేశారు. అనంతరం మహిళను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సుమారు ఐదు నిమిషాల్లోనే సహాయక చర్యలు పూర్తి చేశారు.


ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన సిబ్బంది క్షణాల్లో స్పందించి మహిళ ప్రాణాలను కాపాడిన తీరు ఫుటేజీలో కనిపిస్తోంది. ‘ఆపరేషన్ జీవన్ రక్ష’లో భాగంగా ఈ రెస్క్యూ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సురక్షితంగా బయటపడిన మహిళ ఆర్‌పీఎస్‌ఎఫ్‌ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది. కదులుతున్న రైలులో ఎక్కడం, దిగడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మరోసారి తెలియజేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

క్షుద్ర పూజలంటూ అపవాదు వేశారు

బీఎల్‌వోలు ఓటర్ల ఇంటికే వెళ్లండి..!

Read Latest AP News And Telangana News 

Updated Date - Oct 01 , 2026 | 08:07 AM