Share News

ఓట్ల తొలగింపుపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు.. ఈసీకి హెచ్చరిక

ABN , Publish Date - Oct 01 , 2026 | 02:57 PM

మాజీ మంత్రి దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓట్ల తొలగింపులో ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోవాలన్నారు.

ఓట్ల తొలగింపుపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు.. ఈసీకి హెచ్చరిక
Danam Nagender

హైదరాబాద్, అక్టోబర్ 1: మాజీ మంత్రి దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈరోజు(గురువారం) హిమాయత్‌నగర్ డివిజన్‌లో సీసీ రోడ్ పనుల ప్రారంభోత్సవంలో దానం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఓట్ల తొలగింపులో ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోవాలన్నారు. లేదంటే ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరం తగలబడి పోతుందంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల కమిషన్ అధికారులు.. బీజేపీతో కలిసి పని చేస్తున్నారని ఆరోపించారు.


కేవలం హిమాయత్ నగర్ డివిజన్‌లోనే 20 వేల ఓట్ల వరకు తొలగించారని దానం అన్నారు. ఢిల్లీ కేంద్రంగా బీజేపీ నాయకులు ఓట్ చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి ఓటును కాపాడుకునే బాధ్యత తనపై ఉందన్నారు. ఎన్నికల కమిషన్ తక్షణమే తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ పోరాటాలు ఉధృతంగా ఉంటాయని మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

లింగంపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరి అరెస్ట్

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ దూకుడు.. సెప్టెంబర్‌లో రూ.5,327 కోట్లు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 01 , 2026 | 03:10 PM