ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’పై అప్పీల్ కొట్టివేత
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:22 PM
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాట కాపీరైట్ వివాదానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ఢిల్లీ, అక్టోబర్ 1: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాట కాపీరైట్ వివాదానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. తాను స్వరపరిచిన ప్రముఖ గీతం ‘ఎన్ ఇనియా పొన్ నిలవే’కు సంబంధించిన కాపీరైట్ విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఇళయరాజా పిటిషన్ వేశారు. ఈరోజు(గురువారం) ఈ పిటిషన్‌పై జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ల ధర్మాసనం విచారణ జరిపింది. ‘మూడు పాని’ చిత్రంలోని ప్రఖ్యాత గీతం ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాట కాపీరైట్ వివాదంలో సంగీత దర్శకుడి అప్పీల్‌ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
పాటలోని సంగీతం(ట్యూన్)పై మాత్రమే ఇళయరాజాకు హక్కు ఉంటుందని సుప్రీం ధర్మాసనం తేల్చిచెపింది. సాహిత్యం, సౌండ్ రికార్డింగ్‌పై కాపీరైట్ హక్కులు ఆయనకు చెందవని పునరుద్ఘాటించింది. చిత్ర నిర్మాత నుంచి సౌండ్ రికార్డింగ్‌కు సంబంధించిన హక్కులను పొందిన ‘సరిగమ’ మ్యూజిక్ లేబుల్‌కు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సమర్థనీయమేనన్న సుప్రీంకోర్టు పేర్కొంది. ‘అఘతియా’ చిత్రంలో రీక్రియేటెడ్ వెర్షన్ లైసెన్స్ వివాదంపై ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో మ్యూజిక్ లేబుల్ ‘సరిగమ’కు చట్టపరమైన ఊరట లభించినట్లైంది.
ఇవి కూడా చదవండి...
ప్రయాణికులను కాపాడేది వాళ్లే.. ఎమర్జెన్సీలో జరిగేదేంటో ముందే చెప్పిన హీరో పైలట్
బకాయిలు చెల్లించక పోతే... ఎమ్మెల్యేల కమీషన్ల దందా బయటపెడతాం
Read Latest National News And Telugu News