బకాయిలు చెల్లించక పోతే... ఎమ్మెల్యేల కమీషన్ల దందా బయటపెడతాం
ABN , Publish Date - Oct 01 , 2026 | 06:04 AM
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంలో కంటే కాంగ్రెస్ పాలనలోనే కమీషన్ల దందా ఎక్కువగా ఉందని ఆ రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు మంజునాథ్ ఆరోపించారు.
కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు మంజునాథ్ హెచ్చరిక
బెంగళూరు, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంలో కంటే కాంగ్రెస్ పాలనలోనే కమీషన్ల దందా ఎక్కువగా ఉందని ఆ రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు మంజునాథ్ ఆరోపించారు. బెంగళూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పర్సెంటేజీ ఎంత అనేది చెప్పనని, కానీ 70శాతం మంది ఎమ్మెల్యేలు టెండర్లు, కమీషన్ల కోసం డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. వారు అనుమతించాకే పనులు చేయాల్సి వస్తోందని, ఈ విషయం సీఎంకు తెలుసన్నారు. గతంలో ఎన్నికల సమయంలో మాత్రమే ఎంతోకొంత సర్దుబాటు చేయమని కోరేవారని, ప్రస్తుతం ప్రతి పనిలోనూ జోక్యం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యవర్తుల ద్వారా కమీషన్లకోసం వేధిస్తున్నారని ఆరోపించారు. మంత్రి సతీశ్ జార్కిహొళి శాఖ, బీబీఎంపీ మినహా మిగిలిన అన్నింటిలోనూ కమీషన్ ఇవ్వాల్సిందేనన్నారు. నాలుగేళ్లుగా 8 శాఖలకు సంబంధించి రూ.37 వేల కోట్లకు పైగా బిల్లుల బకాయి ఉందని, బిల్లులను చెల్లించాలని కోరుతూ సీఎం డీకే శివకుమార్‌కు బుధవారం లేఖ రాశామని ఆయన తెలిపారు. నవంబరులోగా పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే కమీషన్ దందా ఆధారాలను విడుదల చేస్తామని హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
రష్యా సైన్యంలో చేరొద్దు.. భారతీయులకు కేంద్రం హెచ్చరిక
డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడా: ప్రధాని మోదీ