Share News

డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడా: ప్రధాని మోదీ..

ABN , Publish Date - Sep 30 , 2026 | 08:18 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు సహా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.

డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడా: ప్రధాని మోదీ..
Modi Trump phone call

ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలు సహా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ట్రంప్‌తో జరిగిన సంభాషణ ఫలప్రదంగా సాగిందని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించినట్లు చెప్పారు (PM Modi Donald Trump Call).


భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్న సమయంలో మోదీ-ట్రంప్ ఫోన్ సంభాషణ జరిగింది. భారత్-అమెరికా సంబంధాల్లో రక్షణ సహకారం కీలక అంశంగా కొనసాగుతోంది. రక్షణ రంగంతో పాటు ఇంధనం, వ్యూహాత్మక సాంకేతికతలు, ఇతర కీలక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఇరు దేశాలు గతంలో పలు కార్యక్రమాలను చేపట్టాయి. ప్రస్తుత ఫోన్ సంభాషణలో కూడా ఈ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించినట్లు మోదీ తెలిపారు (Modi Trump phone call).


తాజాగా అమెరికా అధ్యక్షుడితో వాణిజ్యం, రక్షణ, ఇంధనం, కీలక సాంకేతికతలతో పాటు ఇతర రంగాల్లో సహకారంపై చర్చించినట్లు మోదీ పేర్కొన్నారు (India US trade deal). భారత్, అమెరికా మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సన్నిహితంగా సంప్రదింపులు కొనసాగించాలని ఇరువురు నేతలు అంగీకరించారు. జూన్‌లో ఫ్రాన్స్‌లోని ఇవియన్‌లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా మోదీ, ట్రంప్‌ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో గణనీయమైన పురోగతి నమోదైందని అప్పుడు ఇరువురు నేతలు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

అక్టోబర్ 2 నుంచి 'సేవ్ డెమోక్రసీ' మార్చ్.. సీఈసీపై ఇండియా కూటమి నిరసనలు..


రెండు నిమిషాల్లో 17 వేల అడుగుల కిందకు.. దుబాయ్‌-టెల్ అవీవ్ విమానంలో ఏం జరిగింది..

Updated Date - Sep 30 , 2026 | 08:18 PM