2న ‘జైల్ భరో ఆందోళన్’
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:51 AM
కేంద్ర ఎన్నికల సంఘం వైఖరిని నిరసిస్తూ మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న ముంబైలోని శివాజీ పార్క్ వేదికగా ‘జైల్ భరో ఆందోళన్’ చేపట్టనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు.
అన్ని పార్టీలు
ఏకం కావాలి: దీప్కే
కేంద్ర ఎన్నికల సంఘం వైఖరిని నిరసిస్తూ మహాత్మా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న ముంబైలోని శివాజీ పార్క్ వేదికగా ‘జైల్ భరో ఆందోళన్’ చేపట్టనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. బుధవారం ముంబైలో మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ఎన్నికల సంఘం పనితీరు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందంటూ మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను కాపాడుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముంబైలో ప్రారంభం కానున్న ఈ ఆందోళనను త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలకు విస్తరింపజేస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. మరోవైపు, ఈసీ తీరును తప్పుపడుతూ అక్టోబర్ 4న ముంబైలో మహా మార్చ్ నిర్వహించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
రష్యా సైన్యంలో చేరొద్దు.. భారతీయులకు కేంద్రం హెచ్చరిక
డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడా: ప్రధాని మోదీ