పహల్గాం ఉగ్రవాది మూసా హతం
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:36 AM
గత ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం దాడిలో పాల్గొన్న లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ సులేమాన్ షా అలియాస్ హాషిమ్ మూసాను భద్రతా బలగాలు బుధవారం ఓ ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టాయి
శ్రీనగర్, సెప్టెంబరు 30: గత ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం దాడిలో పాల్గొన్న లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాది, మోస్ట్ వాంటెడ్ సులేమాన్ షా అలియాస్ హాషిమ్ మూసాను భద్రతా బలగాలు బుధవారం ఓ ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టాయి. బుద్గామ్ జిల్లాలోని యూస్‌మార్గ్ కొరాగ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ జవాన్లు, భారత సైన్యం సంయుక్తంగా ఆపరేషన్ కొరాగ్ నిర్వహించి మూసాను హతమార్చాయి. పహల్గాంలో దాడికి పాల్పడ్డ నలుగురు ఉగ్రవాదుల ఫొటో గతంలోనే వైరల్ అయింది. ఫొటోలోని మిగతా ఉగ్రవాదులను ఇప్పటికే వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మట్టుబెట్టగా బుధవారం మూసాను అంతమొందించారు. ఎదురుకాల్పుల్లో మూసా హతమయ్యాయడని భద్రతా బలగాలకు చెందిన చినార్ కోర్ తెలిపింది. ఆపరేషన్ కొరాగ్‌లో మూసా హతమవడంతో పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టినట్లయింది.
ఈ వార్తలు కూడా చదవండి
రష్యా సైన్యంలో చేరొద్దు.. భారతీయులకు కేంద్రం హెచ్చరిక
డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడా: ప్రధాని మోదీ