Share News

ఏపీకి భారీ పారిశ్రామిక వరం.. దుగరాజపట్నంలో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్

ABN , Publish Date - May 21 , 2026 | 08:26 PM

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రప్రభుత్వం భారీ పారిశ్రామిక ప్రాజెక్టును ప్రకటించింది. రాష్ట్రంలో రూ.30,000 కోట్ల వ్యయంతో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర నౌకాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ఈ నెల్లోనే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఆమోదం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

ఏపీకి భారీ పారిశ్రామిక వరం.. దుగరాజపట్నంలో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్
Coastal Development

ఢిల్లీ, మే 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రప్రభుత్వం భారీ పారిశ్రామిక ప్రాజెక్టును ప్రకటించింది. రాష్ట్రంలో రూ.30,000 కోట్ల వ్యయంతో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర నౌకాశాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ఈ నెల్లోనే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఆమోదం ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. దుగరాజపట్నం వద్ద ఈ మెగా నౌకా నిర్మాణ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి కసరత్తు జరుగుతోంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో విస్తరించనున్న ఈ ప్రాజెక్టు కోసం సుమారు 3,488 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించనుంది.ఈ క్లస్టర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే దేశంలోనే అతిపెద్ద నౌకా నిర్మాణ కేంద్రంగా ఏపీ నిలిచే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. నౌకల తయారీతో పాటు భారీ స్థాయిలో షిప్ రిపేర్, మెయింటెనెన్స్ సదుపాయాలు కూడా ఇందులో ఏర్పాటు కానున్నాయి.


ఏపీలో సరికొత్త పారిశ్రామిక విప్లవం

ఈ ప్రాజెక్టుతో ఏపీలో సరికొత్త పారిశ్రామిక విప్లవం ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల మందికి పైగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్టీల్, మెరైన్ ఇంజనీరింగ్, విడిభాగాల తయారీ, పోర్ట్ లాజిస్టిక్స్ రంగాల్లో వందలాది అనుబంధ పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చే అవకాశముంది. అంతర్జాతీయ నౌకాయాన సంస్థలు కూడా ఈ క్లస్టర్ వైపు ఆకర్షితమయ్యే అవకాశముందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారీ విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉండటంతో ఏపీ పారిశ్రామిక రంగానికి ఇది కీలక మలుపుగా మారనుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ‘పోర్ట్ ఆధారిత వృద్ధి’ ఆలోచనలకు ఈ ప్రాజెక్టు పెద్ద ఊతమివ్వనుంది. తీర ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఇది బలాన్నిస్తుంది.


నౌకాశ్రయ, సముద్ర పారిశ్రామిక రంగంలో కీలక హబ్‌..

అలాగే రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ప్రతిపాదించిన దుగరాజపట్నం పోర్టు ప్రాజెక్టుకు బదులుగా మరింత భారీ స్థాయిలో ఈ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్‌ను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. 2047 నాటికి భారత్‌ను ప్రపంచ నౌకా నిర్మాణ రంగంలో టాప్-5 దేశాల్లో ఒకటిగా నిలపాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ అడుగు వేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశ నౌకాశ్రయ, సముద్ర పారిశ్రామిక రంగంలో కీలక హబ్‌గా ఎదిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

సాంకేతికతతో గ్లోబల్ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉంది: సీఎం చంద్రబాబు

నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: పవన్ కల్యాణ్

దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ: మంత్రి లోకేశ్

దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 21 , 2026 | 08:41 PM