విచారణ, నోటీసు లేకుండా ఓట్లు తొలగించొద్దు: అశోక్‌బాబు
ABN , Publish Date - Aug 12 , 2026 | 06:04 PM
ఓటర్ల జాబితా సవరణలు, సమస్యలపై ఆంధ్రప్రదేశ్ సీఈఓను కలిశానని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. 175 నియోజకవర్గాల్లోనూ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేశారని తెలిపారు.
అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా సవరణలు, సమస్యలపై ఆంధ్రప్రదేశ్ సీఈఓ (CEO)ను కలిశానని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు (Ashok Babu) పేర్కొన్నారు. 175 నియోజకవర్గాల్లోనూ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను అధికారులు విడుదల చేశారని తెలిపారు. అయితే పెండింగ్‌లో ఉన్న 14 నియోజకవర్గాల జాబితా ఈరోజు ఇచ్చారని ప్రస్తావించారు. 44 లక్షల సవరణ నోటీసుల్లో కేవలం 10శాతం మాత్రమే ఇచ్చారని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఈఓకు విజ్ఞప్తి చేశారు. చిన్న చిన్న సవరణల కోసం ఓటర్లను ఎమ్మార్వో/తహసీల్దార్ ఆఫీసుల చుట్టూ తిప్పవద్దని కోరారు.
బీఎల్‌వోలు నేరుగా గ్రామాలు, వార్డులకు వెళ్లి సమాచారం సేకరించి ఓటర్ జాబితా సవరణలు పూర్తి చేయాలని ప్రతిపాదించామని అశోక్ బాబు తెలిపారు. నూతన ఓటర్ల నమోదు: 01-07-2026 నాటికి 18 ఏళ్లు నిండిన అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపుపై నిబంధనలు: స్పష్టమైన విచారణ, నోటీసు, స్పీకింగ్ ఆర్డర్ (Speaking Order) లేకుండా ఓట్లను తొలగించవద్దని సూచించారు. సెప్టెంబర్ వరకు సమయం చాలకపోతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగి ప్రక్రియ గడువును మరో 10 నుంచి15 రోజులు పొడిగించాలని అశోక్ బాబు కోరారు.
వార్తలు కూడా చదవండి...
వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు సహకరించాలి: సీఎం చంద్రబాబు
అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి తొలగిన అడ్డంకులు
ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News