అన్ని కాలేజీల్లో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలి.. ఏపీ ఇంటర్ బోర్డు ఆదేశం
ABN , Publish Date - Nov 25 , 2026 | 09:38 PM
ఏపీలోని అన్ని జూనియర్ కళాశాలల్లో గురువారం 'రాజ్యాంగ దినోత్సవ' వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా ప్రకటించారు. ఈ వేడుకల నిర్వహణలో అలసత్వం వహిస్తే తీవ్రంగా పరిగణిస్తామని DIEO, DVEO, RIOలకు హెచ్చరికలు జారీ చేశారు.
అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఏపీలోని అన్ని జూనియర్ కళాశాలల్లో రేపు (గురువారం) 'రాజ్యాంగ దినోత్సవ' వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా ప్రకటించారు. ఈ వేడుకల నిర్వహణలో అలసత్వం వహిస్తే తీవ్రంగా పరిగణిస్తామని DIEO, DVEO, RIOలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఈ వేడుకలను గురువారం ఉదయం 11 గంటలకు ఘనంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్, సంక్షేమ, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, కాంపోజిట్ డిగ్రీ కళాశాలల్లో తప్పనిసరిగా ఈ వేడుకలు జరపాలని స్పష్టం చేశారు.
రేపు ఉదయం 11:00 గంటలకు విద్యార్థులు, అధ్యాపకులతో భారత రాజ్యాంగ పీఠిక సామూహిక పఠనం చేయించాలని ఆజ్ఞాపించారు. MyGov పోర్టల్ ద్వారా 23 భాషల్లో ఆన్‌లైన్ పీఠిక పఠనంలో పాల్గొనాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. MYBharat, MyGov పోర్టల్స్ ద్వారా నిర్వహిస్తున్న రాజ్యాంగ క్విజ్‌లో విరివిగా పాల్గొనాలని సూచించారు. 'వికసిత్ భారత్ యువ సంవాద్' కార్యక్రమంలో యువత భాగస్వామ్యం వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి
అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News