Share News

ఏపీ పంచాయతీ ఎన్నికల రీ-పోలింగ్ పూర్తి.. 24.28 శాతం పోలింగ్ నమోదు

ABN , Publish Date - Nov 27 , 2026 | 03:34 PM

పంచాయతీ ఎన్నికల్లో రీ-పోలింగ్ వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విడుదల చేశారు. ఎన్నికల అవకతవకల కారణంగా నిన్న (నవంబర్ 26) మూడు చోట్ల రీ-పోలింగ్‌కు ఆదేశించామని పేర్కొన్నారు.

ఏపీ పంచాయతీ ఎన్నికల రీ-పోలింగ్ పూర్తి.. 24.28 శాతం పోలింగ్ నమోదు
AP SEC Anil Chandra Punetha

విజయవాడ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో రీ-పోలింగ్ వివరాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా (AP SEC Anil Chandra Punetha) విడుదల చేశారు. ఎన్నికల అవకతవకల కారణంగా నిన్న (నవంబర్ 26) మూడు చోట్ల రీ-పోలింగ్‌కు ఆదేశించామని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరు 1వ వార్డు, గరికపాడు సర్పంచ్ స్థానానికి రీ-పోలింగ్ జరిగిందని వెల్లడించారు.


శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం నరసంపల్లి 7వ వార్డులో రీ-పోలింగ్‌ను నిర్వహించినట్లు ఏపీ ఎస్‌ఈసీ చెప్పుకొచ్చారు. ఇవాళ (నవంబర్ 27) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు. రీ-పోలింగ్ జరిగిన కేంద్రాల్లో సగటున 24.28 శాతం పోలింగ్ నమోదైందని వివరించారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోందని ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తిరుమలను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

డిసెంబర్‌లో నంది అవార్డుల వేడుక.. భారీ ఏర్పాట్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

స్థానిక ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు: డీజీపీ

Read Latest AP News And Telangana NewsAnd National News

And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 05:22 PM