ఏపీ స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం.. 11,378 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు: ఎస్ఈసీ
ABN , Publish Date - Oct 31 , 2026 | 04:27 PM
స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా 13 నగరపాలక సంస్థలు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
విజయవాడ, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా 13 నగరపాలక సంస్థలు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా, పారదర్శక వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి, శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఈరోజు (శనివారం) విజయవాడలో ఎన్నికల కమిషనర్ మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి జిల్లాలో జనరల్, వ్యయ పరిశీలకులతో పాటు పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
పోలింగ్ విధుల్లో 51,716 మంది సిబ్బంది
ఏకగ్రీవాలు పోనూ మిగిలిన 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీల్లోని మొత్తం - 3,186 వార్డులకు రేపు (ఆదివారం) పోలింగ్ జరగనుందని వివరించారు. ఈ ఎన్నికల కోసం మొత్తం 11,378 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, 51,716 మంది సిబ్బందిని విధుల్లో నియమించామని చెప్పుకొచ్చారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కవరేజ్, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ను భద్రపరిచే గడువును 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచామని తెలిపారు. ఎలక్షన్ పిటిషన్లు పరిష్కారమయ్యే వరకు వీటిని స్ట్రాంగ్ రూమ్స్‌లో భద్రపరుస్తామని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా పేర్కొన్నారు.
పోలింగ్ కోసం ఏపీవ్యాప్తంగా పటిష్ఠ పోలీసు బందోబస్తు: ఐజీ రాజకుమారి
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ కోసం ఏపీవ్యాప్తంగా పటిష్ఠ పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఐజీ రాజకుమారి తెలిపారు. ఎన్నికల విధుల్లో మొత్తం 36,351 మంది పోలీసు బలగాలు విధుల్లో ఉన్నాయని వెల్లడించారు. సమస్యాత్మక, హింసాత్మక ప్రాంతాల్లో 130 ప్లాటూన్ల ఏపీ స్పెషల్ పోలీసు బలగాల ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో 1+4, 1+3 స్కేల్‌తో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ, అదనపు ఎస్పీల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ విధుల్లో ఉన్నాయని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యధిక పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు, వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ద్వారా నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
12,000 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు..
6,600 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 12,000 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేసినట్లు ఐజీ రాజకుమారి వివరించారు. బ్యాలెట్ బాక్సుల తరలింపు, రూట్ క్లియరెన్స్ కోసం 1,543 రూట్ మొబైల్ వాహనాల వినియోగిస్తున్నట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎస్పీ, సీనియర్ అధికారుల పర్యవేక్షణలో క్విక్ రియాక్షన్ టీమ్స్ (QRT) ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎన్నికల కోడ్ (MCC) ఉల్లంఘనలను అడ్డుకునేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ రోజున ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్ శాతం డేటాను అధికారులు వెల్లడిస్తారని ఐజీ రాజకుమారి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ నష్టంపై సమగ్ర అంచనా.. ప్రతి బాధితుడికి న్యాయం: సీఎం చంద్రబాబు
మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి: పవన్ కల్యాణ్
స్థానిక ఎన్నికలు.. బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు: ఏపీ ఎస్ఈసీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News