పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. అదనపు పింఛన్ పెంపు
ABN , Publish Date - Sep 22 , 2026 | 01:37 PM
పింఛనుదారులకు అదనపు పింఛన్ శాతాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అదనపు పింఛన్ రేట్లను పునరుద్ధరిస్తూ జీవో ఎంఎస్ నంబర్- 126ను ఆర్థిక శాఖ విడుదల చేసింది.
అమరావతి, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): పింఛనుదారులకు అదనపు పింఛన్ శాతాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అదనపు పింఛన్ రేట్లను పునరుద్ధరిస్తూ జీవో ఎంఎస్ నంబర్- 126ను ఆర్థిక శాఖ విడుదల చేసింది. 70 ఏళ్లు పూర్తయిన పింఛనుదారులు/ఫ్యామిలీ పింఛనుదారులకు అదనపు పింఛన్‌ను 7శాతం నుంచి 10శాతానికి రాష్ట్ర సర్కార్ పెంచింది.
75 ఏళ్లు పూర్తయిన పింఛనుదారులకు అదనపు పింఛన్‌ను 12శాతం నుంచి 15శాతానికి కూటమి సర్కార్ పెంచింది. పెంచిన అదనపు పింఛన్ డిసెంబర్ 2026 నెల పింఛనుకు వర్తిస్తుందని స్పష్టం చేసింది పెరిగిన ఈ మొత్తాన్ని జనవరి 1, 2027న చెల్లించనుంది. 80 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి అదనపు పింఛన్ రేట్లలో ఎలాంటి మార్పు లేదని సర్కార్ తేల్చిచెప్పింది. ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘాల విజ్ఞప్తి మేరకు పరిశీలించి పాత రేట్లను ఏపీ ప్రభుత్వం పునరుద్ధరించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
జూనియర్ డాక్టర్లకు ఏపీ సర్కార్ శుభవార్త.. స్టైపెండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ
ఏపీలో అతిభారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: హోం మంత్రి అనిత
పోలీసులు కొట్టడం వల్లే సాయికృష్ణ చనిపోయాడు: సిట్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News