Share News

శ్రీవారి ఫొటోలతో వైసీపీ అపచారం.. ఏపీ వ్యాప్తంగా నిరసనలకు కూటమి పక్షాల నిర్ణయం

ABN , Publish Date - Feb 20 , 2026 | 05:44 PM

ఏపీ ఎన్డీఏ కూటమి పక్షాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. శాసనమండలిలో వైసీపీ సభ్యులు.. వేంకటేశ్వరస్వామి ఫొటోలతో చేసిన మహాపచారంపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించాయి..

శ్రీవారి ఫొటోలతో వైసీపీ అపచారం.. ఏపీ వ్యాప్తంగా నిరసనలకు కూటమి పక్షాల నిర్ణయం
AP NDA Alliance Parties

అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఏపీ ఎన్డీఏ కూటమి పక్షాలు (AP NDA Alliance Parties) కీలక నిర్ణయం తీసుకున్నాయి. శాసనమండలిలో వైసీపీ సభ్యులు.. వేంకటేశ్వర స్వామి ఫొటోలతో చేసిన మహాపచారంపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా కూటమి పక్షాల నేతలు, మంత్రులు, పార్టీ అధ్యక్షులతో ఇవాళ(శుక్రవారం) జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు(శనివారం) ఏపీలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు, సంప్రోక్షణ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.


అదే విధంగా పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో కూటమి పక్షాల నేతలు ప్రెస్‌మీట్‌లు నిర్వహించి, దేవుడికి జరిగిన అపచారాన్ని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. కలిసివచ్చే, బావ సారూప్యత ఉన్న వివిధ మఠాధిపతులు, స్వామీజీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్ణయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు వెంటనే సమాచారం పంపాలని అన్ని పార్టీల నాయకులకు ఆదేశాలు జారీ అయ్యాయి.


రేపు శనివారం కావడంతో ఆలయాల వద్ద ప్రక్షాళన చేయాలని కొందరు కూటమి నేతలు కోరారు. ఇలా పలు కార్యక్రమాలు నిర్వహించాలని కూటమి సభ్యులు సూచించారు. అలాగే వైసీపీ విషయంపై భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయాలని చర్చించాయి. జూమ్ కాన్ఫరెన్స్‌లో వీటిపై నిర్ణయం తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం: నారా భువనేశ్వరి

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 05:58 PM