Share News

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఖరారుకు షెడ్యూల్ విడుదల

ABN , Publish Date - Sep 09 , 2026 | 03:24 PM

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఖరారుకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఖరారుకు షెడ్యూల్ విడుదల
AP MPTC ZPTC Elections

అమరావతి, సెప్టెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఖరారుకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫొటో ఓటర్ల జాబితాలను ఎన్నికల కమిషన్ అధికారులు ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్ 14వ తేదీన పోలింగ్ కేంద్రాల ముసాయిదా (Draft) జాబితా రూపకల్పన చేయనున్నారు.


సెప్టెంబర్ 15వ తేదీన పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా ప్రచురించనున్నారు. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు, వినతులను స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 16వ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల కమిషన్ అధికారులు సమావేశం కానున్నారు. సెప్టెంబర్ 18వ తేదీన పోలింగ్ స్టేషన్ల జాబితాకు జిల్లా కలెక్టర్లు ఆమోదం తెలపనున్నారు. సెప్టెంబర్ 19వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు

హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్

నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 09 , 2026 | 03:36 PM