Share News

మంత్రి సుభాశ్ చొరవ.. ఆ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి శస్త్రచికిత్స

ABN , Publish Date - Aug 03 , 2026 | 04:28 PM

ఫ్యాన్‌కోనీ అనీమియాతో బాధపడుతున్న బాలుడికి అండగా ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాశ్ నిలిచారు. రూ.20 లక్షల బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు.

మంత్రి సుభాశ్ చొరవ.. ఆ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి శస్త్రచికిత్స
AP Minister Vasamsetti Subash

అమరావతి, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఫ్యాన్‌కోనీ అనీమియాతో బాధపడుతున్న బాలుడికి అండగా ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాశ్ (AP Minister Vasamsetti Subash) నిలిచారు. రూ.20 లక్షల బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ బసవతారకం ఆస్పత్రిలో చరణ్ తేజ పవన్‌కు శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. బోన్ మ్యారో దాత నుంచి సేకరణ ప్రక్రియ విజయవంతమైంది. పేద కుటుంబానికి సహాయం అందించేందుకు మంత్రి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.


దాతలు, సేవా సంస్థల సహకారంతో చికిత్సకు నిధులను మంత్రి సుభాశ్ సమీకరించారు. సహారా హెల్త్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీ నుంచి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ చికిత్సలో భాగమైన వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. చరణ్ తేజ పవన్ పూర్తిగా కోలుకోవాలని భగవంతుడిని మంత్రి సుభాశ్ ప్రార్థించారు.


వార్తలు కూడా చదవండి...

కేంద్ర పన్నుల వాటాతో ఏపీ అభివృద్ధి మరింత వేగవంతం: సీఎం చంద్రబాబు

డ్రగ్స్ ర‌హిత ఏపీ కోసం కృషి చేస్తున్నాం: మంత్రి నారా లోకేశ్

పొగాకు రైతులకు భారీ సహాయ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 03 , 2026 | 04:36 PM