స్వచ్ఛ సర్వేక్షణ్‌లో సత్తా చాటిన ఏపీ.. మంత్రి నారాయణకు అవార్డులను అందించనున్న రాష్ట్రపతి ముర్ము
ABN , Publish Date - Nov 11 , 2026 | 07:15 AM
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో బుధవారం నిర్వహించనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను మంత్రి నారాయణ అందుకోనున్నారు.
అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ (AP Minister Narayana) ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ఈరోజు (బుధవారం) నిర్వహించనున్న స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను మంత్రి నారాయణ అందుకోనున్నారు. ఈ ఏడాది ఆరు అవార్డులను ఏపీలోని పలు మున్సిపాలిటీలు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డులను విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్లు, కుప్పం మున్సిపాలిటీ దక్కించుకున్నాయి.
సూపర్ స్వచ్ఛ లీగ్ కేటగిరీలో విజయవాడ, గుంటూరు, తిరుపతి కార్పొరేషన్‌లు ఈ అవార్డులను సాధించాయి. ప్రామిసింగ్ స్వచ్ఛ షెహర్ కేటగిరిలో రాజమహేంద్రవరం కార్పొరేషన్‌కు ఈ అవార్డు వచ్చింది. సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్ కేటగిరిలో విశాఖపట్నం (GVMC) అవార్డు దక్కించుకుంది. 20,000 కంటే తక్కువ జనాభా ఉన్న కేటగిరిలో స్వచ్ఛ సిటీగా కుప్పం మున్సిపాలిటీ అవార్డు సాధించింది. ఈ అవార్డుల కార్యక్రమానికి ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు కూడా హాజరుకానున్నారు. ఏపీ మున్సిపల్ శాఖ తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రానికి వరుసగా అవార్డులు వస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
అటవీ అమరవీరుల త్యాగం మరువలేనిది: పవన్ కల్యాణ్
ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. 30కు పైగా అజెండా అంశాలపై సీఎం చర్చ
జగన్.. వైఎస్సార్ పేరు చెడగొడుతున్నారు.. జేసీ ప్రభాకర్ రెడ్డి ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News