Share News

మంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీపై లోకేశ్ ధ్వజం

ABN , Publish Date - Jun 16 , 2026 | 08:17 PM

హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనితపై అమర్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల అసలు స్వరూపాన్ని బయటపెట్టాయని ధ్వజమెత్తారు.

మంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీపై లోకేశ్ ధ్వజం
AP Minister Nara Lokesh

అమరావతి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనితపై అమర్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల అసలు స్వరూపాన్ని బయటపెట్టాయని ధ్వజమెత్తారు. ఈరోజు(మంగళవారం) అమరావతి వేదికగా మంత్రి లోకేశ్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో పాలన, అభివృద్ధి, శాంతిభద్రతలపై సమాధానాలు లేక వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహించారు.


మహిళా నేత, దళిత ప్రజాప్రతినిధిని లక్ష్యంగా చేసుకోవడం వైసీపీ నీచ రాజకీయ సంస్కృతికి నిదర్శనమని లోకేశ్ మండిపడ్డారు. అనిత రాజకీయ ప్రస్థానం, కష్టపడి ఎదిగిన మహిళా వ్యక్తిత్వానికి నిదర్శనమని లోకేశ్ ప్రశంసించారు. అనితకు, మహిళలకు, దళిత సమాజానికి వైసీపీ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి లోకేశ్ డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ

ఢిల్లీలో జనసేన సేన ప్రస్థానం సమావేశం.. 5 తీర్మానాలకు ఆమోదం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 16 , 2026 | 09:17 PM