కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక ప్రగతిపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
ABN , Publish Date - Nov 28 , 2026 | 06:03 PM
కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక ప్రగతిపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్లో ఆసియాలోనే తొలి ఎండ్లెస్ కాస్టింగ్ అండ్ రోలింగ్ ఉక్కు పరిశ్రమ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక ప్రగతిపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్లో ఆసియాలోనే తొలి ఎండ్లెస్ కాస్టింగ్ అండ్ రోలింగ్ ఉక్కు పరిశ్రమ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా లోకేశ్ పోస్టు పెట్టారు. 2016లో ప్రజాప్రభుత్వం భూ కేటాయింపు, 2018 మేలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసిన ఈ పరిశ్రమ నేడు పూర్తిస్థాయి ఉత్పత్తి అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. సుమారు 430 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,100 కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటైన జై రాజ్ ఇస్పాత్ సమీకృత ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేశారని వెల్లడించారు.
934 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు..
ఈ పరిశ్రమ ప్రాంగణంలో మూడో వంతు పచ్చదనం.. నీటి అవసరాల కోసం 45 ఎకరాల్లో వర్షపు నీటి జలాశయం ఏర్పాటు చేసినట్లు మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు. రెండో దశలో మరో 600 ఎకరాల్లో రూ.3,378 కోట్ల పెట్టుబడితో జై రాజ్ ఇస్పాత్ సంస్థ విస్తరించనుందని వెల్లడించారు. ఈ పరిశ్రమ రెండో దశ విస్తరణ ద్వారా మరో 934 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని వివరించారు. ప్రస్తుతం పరిశ్రమలో పనిచేస్తున్న వారిలో 65 శాతం మంది స్థానికులే కావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. స్థానిక యువతకు వారి సొంత ప్రాంతంలోనే మెరుగైన ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఓర్వకల్లు పారిశ్రామిక అభివృద్ధికి ఈ పరిశ్రమ పునాది వేసి, ఇతర సంస్థల రాకకు బాటలు వేసిందని చెప్పుకొచ్చారు.
ఓర్వకల్లు డ్రోన్ సిటీ శరవేగంగా రూపుదిద్దుకుంటోంది..
కేవలం 12 నెలల్లోనే ఆసియాలోనే అతిపెద్ద పానీయాల తయారీ పరిశ్రమను ఓర్వకల్లులో అందుబాటులోకి రిలయన్స్ సంస్థ తీసుకువచ్చిందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. జాక్సన్, అగస్త్య గ్రీన్ ఎనర్జీ వంటి సౌర విద్యుత్ పరికరాల తయారీ సంస్థలూ ఓర్వకల్లులో పరిశ్రమలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరోవైపు ఓర్వకల్లు డ్రోన్ సిటీ శరవేగంగా రూపుదిద్దుకుంటోందని చెప్పుకొచ్చారు. దేశంలోనే కీలక పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతోందని అన్నారు. రాయలసీమను ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసి కృషి చేద్దామని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
అమరావతి రైతులు చేసిన త్యాగాన్ని జగన్ అండ్ కో ఎగతాళి చేస్తున్నారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
రాజకీయ విభేదాలకు అతీతంగా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలి: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telangana NewsAnd National News
And Telugu News