'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు ఎంఎస్ఎంఈ బిల్లు పెద్దపీట వేస్తోంది: మంత్రి కొండపల్లి
ABN , Publish Date - Aug 08 , 2026 | 06:54 PM
పార్లమెంట్‌లో ఎంఎస్ఎంఈ సవరణ బిల్లు 2026కు ఆమోదించడంపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వాగతించారు. నూతన చట్టంతో ఎంఎస్ఎంఈ రంగానికి బలమైన రక్షణ, 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు.
అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌లో ఎంఎస్ఎంఈ (MSME) సవరణ బిల్లు 2026కు ఆమోదించడంపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (AP Minister Kondapalli Srinivas) స్వాగతించారు. నూతన చట్టంతో ఎంఎస్ఎంఈ రంగానికి బలమైన రక్షణ, 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. 'ఒక కుటుంబం - ఒక పారిశ్రామికవేత్త' లక్ష్యానికి ఎంఎస్ఎంఈ బిల్లు ఎంతగానో ఊతమిస్తుందని తెలిపారు. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌కు శాశ్వత హోదాతో ఆన్‌లైన్ ద్వారా త్వరితగతిన వివాదాల పరిష్కారమవుతాయని వెల్లడించారు.
కోర్టుల్లో వివాదాలు ఆరు నెలలు దాటితే అవార్డు కింద మంజూరైన మొత్తంలో 50 శాతం చెల్లింపులు తప్పనిసరి చేసిందని మంత్రి కొండపల్లి అన్నారు. మధ్యవర్తిత్వాన్ని 90 రోజుల్లోపు పూర్తి చేయడం ఎంఎస్ఎంఈలకు చాలా ప్రయోజనమని చెప్పుకొచ్చారు. సీపీఎస్‌ఈలు (CPSE) ఇకపై 'TReDS' ప్లాట్‌ఫారమ్ ద్వారానే ఇన్వాయిస్ సెటిల్‌మెంట్లు చేయాలని స్పష్టం చేశారు. చెల్లింపుల వివాదాల వేగవంతమైన పరిష్కారానికి రాష్ట్రంలో బహుళ ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు వెసులుబాటు ఉంటుందని తెలిపారు. 'వికసిత్ భారత్ @2047' లక్ష్యానికి అనుగుణంగా 'స్వర్ణాంధ్ర' సాధనకు నూతన విధానం దోహదం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
జగన్ అండ్ కోను కంట్రోల్ చేయడానికి నాకు రెండు నిమిషాలు చాలు: సీఎం చంద్రబాబు
పవన్ కల్యాణ్ మానవత్వం.. కళాకారుల ఆరోగ్యానికి ప్రత్యేక చర్యలు
శ్రీకాళహస్తి వ్యాసాశ్రమం వివాదం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News