Share News

పాముకాటు విషానికి... 108 అంబులెన్స్‌లోనే విరుగుడు

ABN , Publish Date - Aug 08 , 2026 | 05:36 PM

అత్యవసర చికిత్సలో భాగంగా పాముకాటు బాధితుల ప్రాణాలను కాపాడేందుకు యాంటీ స్నేక్‌ వీనం ఇంజక్షన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా 108 అంబులెన్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది.

పాముకాటు విషానికి... 108 అంబులెన్స్‌లోనే విరుగుడు
Snakebite Treatment

అమరావతి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): అత్యవసర చికిత్సలో భాగంగా పాముకాటు బాధితుల ప్రాణాలను కాపాడేందుకు యాంటీ స్నేక్‌ వీనం (ASV) ఇంజక్షన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా 108 అంబులెన్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో వర్షకాలంలోనూ, వ్యవసాయ పనుల సమయంలోనూ పాముకాటు ఘటనలు తరచుగా జరుగుతుంటాయి. బాధితులను సమయానికి ఆస్పత్రికి చేర్చడంలో జరిగే జాప్యంతో కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది.


అత్యవసర వైద్య సేవలందిస్తున్న ఈఎంటీల ద్వారానే నేరుగా పాముకాటు విరుగుడు మందును అందజేసేలా సరికొత్త విధానానికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పాముకాటు బాధితులకు తక్షణ వైద్య సాయం అందించి, వారి ప్రాణాలకు పూర్తి భరోసా కల్పిస్తున్నట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కేవలం నిపుణులైన వైద్యుల సూచనల మేరకే, ఈఎంటీ (Emergency Medical Technicians - EMT) సిబ్బంది ఈ ఏఎస్‌వీ ఇంజక్షన్‌ను బాధితులకు అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.


బాధితులకు ఏకైక రక్షణగా నిలిచే యాంటీ స్నేక్‌ వీనం ఇంజక్షన్‌ను ఇకపై అత్యవసర వాహనాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు. వైద్యుల సలహాలు, సూచనలను పాటిస్తూ ఈఎంటీలు తక్షణమే స్పందించి ఈ ఇంజక్షన్‌ను ఇవ్వడం ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడవచ్చు. ఆస్పత్రికి చేరేలోపు విషం ఒంట్లో వ్యాపించకుండా సకాలంలో నివారించవచ్చు. పాము కాటు నుంచి గోల్డెన్ అవర్‌లోనే చికిత్స అందడం వల్ల పాము కాటు నుంచి కాపాడవచ్చు. ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, ప్రజలకు చేరువగా తీసుకురావడంలో ఇదొక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.


వార్తలు కూడా చదవండి...

జగన్ అండ్ కోను కంట్రోల్ చేయడానికి నాకు రెండు నిమిషాలు చాలు: సీఎం చంద్రబాబు

పవన్ కల్యాణ్ మానవత్వం.. కళాకారుల ఆరోగ్యానికి ప్రత్యేక చర్యలు

శ్రీకాళహస్తి వ్యాసాశ్రమం వివాదం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Aug 08 , 2026 | 06:14 PM