Share News

ఏపీలో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్.. డిసెంబరు 5న పోలింగ్

ABN , Publish Date - Nov 27 , 2026 | 06:54 PM

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నోటిఫికేషన్ విడుదల చేశారు. 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల పరోక్ష ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించారు.

ఏపీలో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్.. డిసెంబరు 5న పోలింగ్
AP Municipal Elections

విజయవాడ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఏపీలో పట్టణ స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నోటిఫికేషన్ విడుదల చేశారు. 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల పరోక్ష ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించారు. డిసెంబరు 5వ తేదీ ఉదయం 11 గంటలకు డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


డిసెంబరు 5వ తేదీన ఎన్నిక జరగకపోతే, మరుసటి రోజు డిసెంబరు 6వ తేదీన జరుపుతున్నట్లు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. డిసెంబరు 1వ తేదీన లేదా అంతకుముందే ప్రత్యేక సమావేశాలకు సంబంధించి సభ్యులకు నోటీసులు జారీ చేశారు. శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి - తాడేపల్లి కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహించనున్నారు. గతంలో వాయిదా పడిన నర్సీపట్నం, మాచర్ల మున్సిపాలిటీల వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు కూడా డిసెంబరు 5వ తేదీనే ఎన్నికలు జరగనున్నాయి.


నిన్న (గురువారం) పోలింగ్ ముగిసిన ఈ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు, ఫలితాలను నవంబరు 30వ తేదీన వెల్లడించనున్నారు. చేతులెత్తే పద్ధతిలో పరోక్ష ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, అధికారులు సహకరించాలని ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

తిరుమలను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

డిసెంబర్‌లో నంది అవార్డుల వేడుక.. భారీ ఏర్పాట్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

స్థానిక ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు: డీజీపీ

Read Latest AP News And Telangana NewsAnd National News

And Telugu News

Updated Date - Nov 27 , 2026 | 07:05 PM