ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల హవా.. ఏకగ్రీవమైన స్థానాలివే..
ABN , Publish Date - Oct 27 , 2026 | 08:32 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు జిల్లాల్లో జడ్పీటీసీలను కూటమి పార్టీలు ఏకగ్రీవం చేసుకున్నాయి. ఆయా జిల్లాల్లో నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీల్లో కోలాహలం సంతరించుకుంది. పలు కార్యాలయాల్లో ఏకగ్రీవమైన అభ్యర్థులకు నియామక పత్రాలను కలెక్టర్, ఎన్నికల అధికారులు అందజేశారు.
అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు జిల్లాల్లో జడ్పీటీసీలను కూటమి పార్టీలు ఏకగ్రీవం చేసుకున్నాయి. ఆయా జిల్లాల్లో నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీల్లో కోలాహలం సంతరించుకుంది. పలు కార్యాలయాల్లో ఏకగ్రీవమైన అభ్యర్థులకు నియామక పత్రాలను కలెక్టర్, ఎన్నికల అధికారులు అందజేశారు.
కాకినాడ జిల్లా తునిలో..
తుని మండలంలో తెలుగుదేశం పార్టీ బోణీ
మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్వగ్రామంలోని ఎస్. అన్నవరం 4వ ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ.
వైసీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణతో ఏకగ్రీవమైన ఎన్నిక.
టీడీపీ అభ్యర్థి తుమ్మలపల్లి నాగలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక.
దాడిశెట్టి రాజా స్వగ్రామంలో టీడీపీకి తొలి విజయం.
పల్నాడు జిల్లాలో కూటమి క్లీన్‌స్వీప్
గురజాల నియోజకవర్గంలో మొత్తం 57 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం.
పిడుగురాళ్లలో 18కు 18 ఎంపీటీసీ స్థానాలు కూటమి కైవసం.
మాచవరంలో 15కు 15 ఎంపీటీసీ స్థానాలు కూటమి ఖాతాలోకి..
గురజాల మండలంలో 12కు 12 ఎంపీటీసీ స్థానాలు కూటమి కైవసం.
దాచేపల్లిలో 12కు 12 ఎంపీటీసీ స్థానాలు కూటమి ఖాతాలోకి..
ఏలూరు జిల్లాలో..
ఏలూరు జిల్లాలో పెదవేగి జడ్పీటీసీగా ఎమ్మెల్యే చింతమనేని కుమార్తె నవ్యశ్రీ ఏకగ్రీవం
అధికారికంగా ప్రకటించాల్సిన అధికారులు
పెదకూరపాడు నియోజకవర్గంలో కూటమి క్లీన్ స్వీప్
ఈ నియోజకవర్గంలో మొత్తం 60 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి ఏకగ్రీవం.
అచ్చంపేట మండలంలో 17 కు17 స్థానాలు కూటమి కైవసం.
క్రోసూరు మండలంలో 16 కు 16 స్థానాలు కూటమికే.
అమరావతి మండలంలో 5కు 5 స్థానాలు కూటమి ఖాతాలోకి.
పెదకూరపాడు మండలంలో 13కు 13 స్థానాలు కూటమి ఏకగ్రీవం.
బెల్లంకొండ మండలంలో 9 కు 9 స్థానాలు కూటమి కైవసం.
పల్నాడు జిల్లాలో..
పల్నాడు జిల్లాలో 18 జడ్పీటీసీలు ఏకగ్రీవం.
జిల్లావ్యాప్తంగా 10 జడ్పీటీసీలకు జరగనున్న పోలింగ్.
నరసరావుపేట, చిలకలూరిపేట, మాచర్ల నియోజకవర్గలో అన్ని జడ్పీటీసీల్లో కూటమి ఏకగ్రీవం.
పశ్చిమగోదావరి జిల్లాలో..
పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఏకగ్రీవమైన ఎంపీటీసీలు..
కాళ్లలో 19 ఎంపీటీసీల్లో 10 స్థానాల్లో కూటమి ఏకగ్రీవం.
ఆకివీడు 12 ఎంపీటీసీల్లో 8 కూటమి ఖాతాలోకే.
ఉండి 19 ఎంపీటీసీల్లో 6 కూటమి కైవసం.
పాలకోడేరు 19 ఎంపీటీసీల్లో 4 ఏకగ్రీవం.
తణుకు నియోజకవర్గంలో..
తణుకు నియోజకవర్గంలో నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం.
తణుకు మండలం వేల్పూరులో మూడు స్థానాలు కూటమి ఖాతాలోకి..
అత్తిలి మండలం కొమ్మరలో ఒక స్థానం కూటమి అభ్యర్థుల కైవసం.
అభ్యర్థులను అభినందించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ.
పల్నాడు జిల్లా పరిషత్తు ఎన్నికల్లో..
మాచర్ల నియోజకవర్గంలో కూటమి క్లీన్ స్వీప్
5 జడ్పీటీసీలు ఏకగ్రీవం.
71 ఎంపీటీసీలు ఏకగ్రీవం.
నరసరావుపేటలో..
పల్నాడు జిల్లాలో నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీల కోలాహలం.
నరసరావుపేట ఆర్డీవో ఆఫీసులో నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీలకు నియామక పత్రాలు అందజేత.
జిల్లాలో 28 జడ్పీటీసీ స్థానాలకు గానూ 18 జడ్పీటీసీలు ఏకగ్రీవం.
మిగిలిన 10 స్థానాల్లో జరగనున్న ఎన్నికలు.
నరసరావుపేట ఆర్డీవో కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన జడ్పీటీసీలకు నియామక పత్రాలు అందజేసిన జాయింట్ కలెక్టర్ సంజనా శ్రీ హర్ష.
కర్నూలు జిల్లాలో..
కర్నూలు జిల్లాలో 26 జడ్పీటీసీ స్థానాలకు 198 నామినేషన్లు దాఖలు, 33 నామినేషన్లు తిరస్కరణ
68 నామినేషన్లు ఉపసంహరణ, బరిలో ఉన్న జడ్పీటీసీ అభ్యర్థులు - 97
టీడీపీ - 21 జడ్పీటీసీ స్థానాలకు, వైసీపీ - 25, బీజేపీ - 2, జనసేన - 3 జడ్పీటీసీ స్థానాలకు పోటీ
సీపీఐ - 3, సీపీఎం - 1 , కాంగ్రెస్ - 12 జడ్పీటీసీ స్థానాలకు పోటీ.
నంద్యాల జిల్లాలో..
బనగానపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హవా.
చక్రం తిప్పిన ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.
నియోజకవర్గంలోని 5 జడ్పీటీసీ, 5 ఎంపీపీ స్థానాలు టీడీపీకే ఏకగ్రీవం.
నియోజకవర్గంలో మొత్తం 85 ఎంపీటీసీ స్థానాలు కూటమి ఖాతాలోకే.
ఇందులో 57 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి విజయం.. 28 స్థానాల్లో వైసీపీ ఏకగ్రీవం.
ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు డిక్లరేషన్ ఫారాలు అందజేసిన ఎన్నికల అధికారులు
కాకినాడ జిల్లాలో..
కాకినాడ జిల్లాలో మొత్తం 20 జెడ్పీటీసీ స్థానాల్లో అన్ని పార్టీల నుంచి బరిలో - 80మంది అభ్యర్థులు
20 జడ్పీస్థానాల్లో టీడీపీ నుంచి - 11, జనసేన - 7 , బీజేపీ - 2, వైసీపీ నుంచి - 20, స్వతంత్రులు - 9 స్థానాల్లో పోటీ.
కడప జిల్లాలో..
కడప జిల్లా 39 జడ్పీటీసీలకు గాను... 23 జడ్పీటీసీలు కూటమి ఏకగ్రీవం.
16 జడ్పీటీసీలకు మాత్రమే ఎన్నికలు.
జడ్పీపీఠంపై తెలుగుదేశం జెండా రెపరెపలు.
రెండు దశాబ్దాల తర్వాత టీడీపీకి అవకాశం రానున్న జడ్పీ ఛైర్మన్ పదవి.
నంద్యాల జిల్లాలో..
జిల్లాలో 8 జడ్పీటీసీల్లో కూటమి ఏకగ్రీవం.
బనగానపల్లె నియోజకవర్గంలోని బనగానపల్లి, కొలిమిగుండ్ల, అవుకు, సంజామల, కోవెలకుంట్లలో కూటమి ఖాతాలోకి..
డోన్ నియోజకవర్గంలో....
బేతంచెర్ల, ప్యాపిలి జడ్పీటీసీలు కూటమి కైవసం.
శ్రీశైలం నియోజకవర్గంలో....
వెలుగోడు జడ్పీటీసీ కూటమి ఏకగ్రీవం.
చిత్తూరు జిల్లాలో....
చిత్తూరు జిల్లాలో మూడు జడ్పీటీసీలు కూటమి ఏకగ్రీవం.
యాదమర్రి జడ్పీటీసీగా టీడీపీ నుంచి యశోద ఏకగ్రీవం.
బంగారు పాల్యం జడ్పీటీసీగా సుచిత్ర జయప్రకాశ్ (TDP) ఏకగ్రీవం.
పూతలపట్టు జడ్పీటీసీగా శైలజ తేజోమూర్తి (TDP) ఏకగ్రీవం.
24 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు.
పోటీ బరిలో కూటమిలోని టీడీపీతో సహా జనసేన, బీజేపీ, వైసీపీ
ఈ వార్తలు కూడా చదవండి..
అర్నబ్ తుఫాన్ గమనంపై నిరంతర నిఘా.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అర్నబ్ తుఫాన్.. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోండి.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
ఏపీకి కేంద్రం భారీ సాయం.. రూ.27, 370 కోట్ల గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టుకు ఆమోదం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News