ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆస్పత్రులకు భారీగా నిధుల విడుదల
ABN , Publish Date - May 19 , 2026 | 06:12 PM
ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆస్పత్రులకు రూ.919.13 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆస్పత్రులకు రూ.919.13 కోట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satya Kumar Yadav) ఓ ప్రకటన విడుదల చేశారు. బకాయిల చెల్లింపుల హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని స్పష్టం చేశారు. ట్రై-పార్టీ బిల్ డిస్కౌంటింగ్ విధానంలో నిధులు విడుదల చేసినట్లు వివరించారు. 785 ప్రైవేట్ ఆస్పత్రులు బిల్ డిస్కౌంటింగ్‌కు దరఖాస్తు చేసినట్లు తెలిపారు.
ఆస్పత్రుల ఖాతాలకు ఇప్పటికే రూ.919.13 కోట్ల జమ చేశామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు సీఈఓ చక్రధరబాబు.. మంత్రికి నివేదిక అందజేశారు. ఆస్పత్రుల విజ్ఞప్తి మేరకు వేగంగా బకాయిలు చెల్లించామని అన్నారు. ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేశారని తెలిపారు. ట్రస్టు - ఆస్పత్రులు - పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మధ్య ఒప్పందాలు జరిగాయని ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ ఆస్పత్రులకు మొత్తం రూ.5,556 కోట్లు చెల్లించామని తెలిపారు. అదనంగా మరో రూ.919.13 కోట్లు విడుదల చేశామని అన్నారు. ఆరోగ్య సేవల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
భవిష్యత్తు న్యూక్లియర్ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది: నారా లోకేశ్
భార్యను అడ్డుపెట్టుకొని పేర్ని నాని బతికిపోయారు.. మంత్రి పార్థసారథి షాకింగ్ కామెంట్స్
Read Latest AP News And Telangana News And International News And Telugu News