ఏబీఎన్ ఎఫెక్ట్.. రొయ్యల ఫీడ్ ధరల పర్యవేక్షణకు శాశ్వత కమిటీ ఏర్పాటు
ABN , Publish Date - Jun 15 , 2026 | 09:49 PM
ఆక్వా రైతుల సమస్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రసారం మయ్యాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ క్రమంలో ఆక్వా రంగ రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): ఆక్వా రైతుల సమస్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రసారం మయ్యాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఈ క్రమంలో ఆక్వా రంగ రైతుల ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రొయ్యల ఫీడ్ ధరల నియంత్రణ, పారదర్శకత కోసం శాశ్వత రాష్ట్రస్థాయి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు యానిమల్ హస్బండ్రీ అండ్ ఫిషరీస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి. రాజశేఖర్ జీఓ ఆర్టీ నంబర్ 180 జారీ చేశారు. ఈ నిర్ణయంపై ఏపీ పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ఓ ప్రకటన విడుదల చేశారు. ఆక్వా రైతుల సంక్షేమం, ఉత్పత్తి వ్యయాల తగ్గింపే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఫీడ్ ధరల నియంత్రణకు ప్రత్యేక కమిటీ
ఏపీ శ్రింప్ ఫీడ్ ఇన్‌గ్రిడియెంట్స్ ప్రైస్ మానిటరింగ్ కమిటీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ కమిటీ ఫీడ్ ముడిపదార్థాల ధరలు, తయారీ ఖర్చులు, రవాణా వ్యయాలు వంటి అంశాలను శాస్త్రీయంగా అంచనా వేయనుంది. ఫిష్‌మీల్, సోయాబీన్ వంటి ప్రధాన ముడిపదార్థాల ధరలపై నిరంతర నిఘా ఉంచడం, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతలని తెలిపారు. ఈ కమిటీలో MPEDA, CIBA, ఫిషరీస్ యూనివర్సిటీ ప్రతినిధులు, అలాగే ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులు, డీలర్ల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని వివరించారు. కాకినాడ SIFT ప్రిన్సిపాల్ కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారని తెలిపారు.
డిజిటల్ వ్యవస్థలు పారదర్శకతకు దారితీసే చర్యలు..
ఫీడ్ ధరల సమీక్షను మరింత పారదర్శకంగా చేయడానికి డిజిటల్ యాప్‌ను వినియోగిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే ఐఓటీ సాంకేతికత వినియోగం, ఫీడ్ నాణ్యత ప్రమాణాల పరిరక్షణ, ప్రత్యామ్నాయ ఫీడ్ పదార్థాలపై పరిశోధనకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. ఆక్వా రైతుల ఉత్పత్తి వ్యయాలను తగ్గించి ఈ రంగాన్ని మరింత లాభదాయకంగా తీర్చిదిద్దడమే ఈ చర్యల లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఫీడ్ ధరలలో పారదర్శకత తీసుకురావడం ద్వారా రైతులకు న్యాయమైన ధరలు అందేలా వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సింగపూర్‌లో సీఎం చంద్రబాబుకు గ్రాండ్ వెల్‌కమ్.. ఎన్ఆర్ఐల స్వాగతం
ఐదేళ్లు తాడేపల్లి ప్యాలెస్‌లో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు మొద్దు నిద్రపోయారు: మంత్రి నిమ్మల
Read Latest AP News And Telangana News And National News
And Telugu News