రష్యాలో ఉద్యోగాల పేరుతో యువతకు వల.. ఏపీ ప్రభుత్వం కీలక హెచ్చరిక
ABN , Publish Date - Nov 04 , 2026 | 05:20 PM
రష్యాలో ఉద్యోగాల పేరుతో యువతకు వల వేస్తున్నారని.. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రష్యాలో ఉద్యోగాల పేరుతో యువతకు వల వేస్తున్నారని.. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సర్కార్ ఈరోజు (బుధవారం) ఓ ప్రకటన విడుదల చేసింది. ఆకర్షణీయమైన ప్రకటనలు, అధిక వేతనాల ఆశచూపి రష్యా సైన్యంలోకి బలవంతంగా తరలిస్తున్నట్లు పేర్కొంది. అక్రమ ఏజెంట్లు, అనధికారిక శిక్షణా సంస్థల చేతిలో ఉత్తరాంధ్ర యువత మోసపోతున్నారని వెల్లడించింది.
విదేశాలకు తీసుకెళ్లి.. తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని బెదిరించి సైనిక కార్యకలాపాల్లోకి దళారులు నెట్టేస్తున్నారని ఏపీ ప్రభుత్వం తెలిపింది. గుర్తింపు లేని ఏజెంట్లను నమ్మి విదేశాలకు వెళ్లవద్దని సూచించింది. వీసా, ఉద్యోగ ఒప్పందాలను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపింది. నియామక సంస్థల చట్టబద్ధతపై పూర్తి విచారణ, అధికారిక ధ్రువీకరణ జరిగిన తర్వాతే ముందడుగు వేయాలని సూచించింది.
అనుమానాస్పద ఉద్యోగ ఆఫర్లు, ఏజెంట్ల వివరాలను తక్షణం పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది. విదేశీ ఉద్యోగాల విషయంలో తొందరపాటు వద్దని.. దళారుల మాయమాటలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఏపీ సర్కార్ సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా కూటమిదే విజయం: పవన్ కల్యాణ్
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర పోస్టు
స్థానిక ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీజీపీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News