అర్నబ్ తుఫాన్ సహాయక చర్యల కోసం నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
ABN , Publish Date - Oct 26 , 2026 | 09:36 PM
అర్నబ్ తుఫాన్ సహాయక చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 20 జిల్లాలకు మొత్తం రూ.27 కోట్ల నిధులను మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): అర్నబ్ తుఫాన్ సహాయక చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) నిధులు విడుదల చేసింది. 20 జిల్లాలకు మొత్తం రూ.27 కోట్ల నిధులను మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులను కేటాయించింది.
శ్రీకాకుళం, మార్కాపురం, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పోలవరం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీసత్యసాయి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేసింది. ఈ నిధుల మంజూరుపై ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం
జడ్పీ పీఠాలపై కూటమి కసరత్తు.. చంద్రబాబుతో భేటీ తర్వాతే క్లారిటీ!
రక్షణ రంగంలో ఏపీకి బిగ్ బూస్ట్.. రూ. 2, 500 కోట్లతో BEL ప్రాజెక్టు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News