ఏపీ విద్యుత్ సంస్థల్లో 627 మందికి కారుణ్య నియామకాల భర్తీ
ABN , Publish Date - Oct 07 , 2026 | 04:17 PM
విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులతో ఆయా ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భర్తీ చేసింది.
అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులతో ఆయా ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భర్తీ చేసింది. వారి అర్హత ఆధారంగా జూనియర్ ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్, ప్లాంట్ అసిస్టెంట్ తదితర పోస్టులకు నియామక పత్రాలను ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (AP Minister Gottipati Ravikumar) ఈరోజు (బుధవారం) అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడారు.
ఇప్పటివరకు వివిధ విద్యుత్ సంస్థల్లో మొత్తం 627 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి అన్నారు. ఏపీఎస్పీడీసీఎల్‌లో 265, ఏపీఈపీడీసీఎల్‌లో 160, ఏపీసీపీడీసీఎల్‌లో 115, జెన్‌కోలో 73, ట్రాన్స్‌కోలో 14 పోస్టులను భర్తీ చేసినట్లు వెల్లడించారు. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా 7,000 మందికి పైగా ఎనర్జీ అసిస్టెంట్లను భర్తీ చేశామని చెప్పుకొచ్చారు.
'సూర్య ఘర్' ద్వారా 6 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్..
తమ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచలేదని మంత్రి తెలిపారు. గడిచిన మూడేళ్లలో విద్యుత్ ఛార్జీలను పెంచకుండా నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నామని అన్నారు. 'సూర్య ఘర్' ద్వారా 6 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత/సబ్సిడీ విద్యుత్ లబ్ధి చేకూరుతుందని వివరించారు. సూర్య ఘర్, పీఎం-కుసుమ్ ద్వారా రైతులకు పగటిపూటే నాణ్యమైన కరెంట్ అందజేస్తున్నామని చెప్పారు. వేల కోట్ల రూపాయలతో కొత్త సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్ లైన్ల నిర్మాణం పూర్తి చేశామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
టీటీడీ భక్తులకు అలర్ట్.. ఆ రోజుల్లో VIP దర్శనాలు రద్దు
‘స్త్రీశక్తి’ 100 కోట్లకు పైగా ప్రయాణాలు పూర్తి చేసుకోవడం గర్వకారణం: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News