2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
ABN , Publish Date - Nov 26 , 2026 | 06:12 PM
2019, 2020 సంవత్సరాల నంది చలనచిత్ర అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన (సమాచార, పౌర సంబంధాల) శాఖ జీవో జారీ చేసింది.
అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఏపీలో నంది అవార్డుల (Nandi Awards) సందడి మొదలు కానుంది. 2019, 2020 సంవత్సరాల నంది చలనచిత్ర అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కమిటీని ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన (సమాచార, పౌర సంబంధాల) శాఖ జీవో జారీ చేసింది. నంది అవార్డుల జ్యూరీ నియామకంపై సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2019, 2020 సంవత్సరాలకు మొదటి, రెండో, మూడో ఉత్తమ చిత్రాలతో పాటు రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులను ఈ కమిటీ ఎంపిక చేయనుంది.
నంది అవార్డుల జ్యూరీ కమిటీ ఛైర్మన్‌గా సినీ దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డిని నియమించింది. జ్యూరీ సభ్యులుగా నిర్మాత డీవీకే రాజు, దర్శకులు చంద్ర సిద్ధార్థ, బీవీఎస్ రవిలను నియమించింది. జ్యూరీ సభ్యులుగా తెలుగు విశ్వవిద్యాలయం (తెలంగాణ)కు చెందిన వనజా ఉదయ్, సీనియర్ జర్నలిస్ట్ వడ్డీ ఓంప్రకాశ్ నారాయణలకు చోటు కల్పించింది. జ్యూరీ కమిటీ సభ్యులు/కన్వీనర్‌గా ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSFTVTDC) ఎండీని నియమించింది. నంది అవార్డుల ఎంపికకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడలోని APSFTVTDC ఎండీని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News