ఏపీ ఈగల్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మధ్య కీలక అవగాహన ఒప్పందం
ABN , Publish Date - Aug 28 , 2026 | 04:59 PM
ఆంధ్రప్రదేశ్‌ను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది, పటిష్టమైన చర్యలు చేపట్టే లక్ష్యంతో ఏపీ ఈగల్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
అమరావతి, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది, పటిష్ఠమైన చర్యలు చేపట్టే లక్ష్యంతో ఏపీ ఈగల్ (AP EAGLE) , ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ఈగల్ చీఫ్, ఆకే రవికృష్ణ మీడియాతో మాట్లాడారు. ఈగల్ సంస్థ ప్రివెంటివ్ అవేర్‌నెస్, ఇంటెలిజెన్స్ డ్రివెన్ ఎన్‌ఫోర్స్‌మెంట్, డీ-అడిక్షన్, కమ్యూనిటీ పార్టీసిపేషన్ అనే నాలుగు ప్రాథమిక అంశాలపై పనిచేస్తోందని వ్యాఖ్యానించారు.
ఇప్పటివరకు 2,020 NDPS కేసులు నమోదు చేసి, 65,000 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నామని రవికృష్ణ పేర్కొన్నారు. ఆపరేషన్ చైతన్యం ద్వారా గంజాయి సాగు నిర్మూలనలో కీలక విజయాలు సాధించామని తెలిపారు. 2025 నాటికి (అల్లూరి సీతారామరాజు) జిల్లాలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని వెల్లడించారు. 29,979 మంది గిరిజన రైతులకు ప్రత్యామ్నాయ, స్థిరమైన ఉపాధి మార్గాలు కల్పించామని చెప్పారు.
29,839 ఎకరాల్లో గంజాయికు బదులుగా ఉద్యానవన, ఇతర స్థిరమైన పంటల సాగుకు శ్రీకారం చుట్టామని రవికృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల సమన్వయంతో గిరిజనులకు రూ. 475 కోట్ల ఆర్థిక, ఉపాధి మద్దతు అందించామని తెలిపారు. డ్రగ్స్ వినియోగం, సరఫరా, గంజాయి సాగుకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే ఈగల్ టోల్‌ఫ్రీ నంబర్ - 1972కు సమాచారం ఇవ్వాలని ఆకే రవికృష్ణ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
భారత్ - అమెరికా రక్షణ రంగంలో మరో ముందడుగు
కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News